Fire Accident : పటాకులకు నిప్పంటుకొని భారీ అగ్నిప్రమాదం
Fire Accident | పటాకులకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో ఈ ఘటన జరిగింది.

భదాద్రి కొత్తగూడెం : పటాకులకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో ఈ ఘటన జరిగింది. సారపాకలోని ముత్యాలమ్మ గుడి సమీపంలో నివాసం ఉండే ఓ వ్యాపారి భారీగా పటాకులు కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేశాడు. ఇవాళ సాయంత్రం ప్రమాదవశాత్తు పటాకులకు నిప్పంటుకొని పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి భవనం పాక్షికంగా దెబ్బతిన్నది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎస్ఐ జితేందర్ రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పటాకులకు నిప్పంటుకొని ఉండొచ్చని భావిస్తున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

