పారిశ్రామికవాడలో తటాకాన్ని తలపిస్తున్న అంతర్గత రహదారులు
పారిశ్రామికవాడగా పేరున్న సారపాక మేజర్ పంచాయతీలో అంతర్గత రహదారులు చిన్నపాటి వర్షానికే తటాకాలను తలపిస్తున్నాయి. సారపాక-ఇరవెండి ప్రధాన రహదారి దెబ్బతినడంతో గోతులు ఏర్పడి చిన్నపాటి వర్షాలకే గోతుల్లో వరదనీరు చేరి బురదమయంగా మారి...
బూర్గంపహాడ్, జూలై 01 : పారిశ్రామికవాడగా పేరున్న సారపాక మేజర్ పంచాయతీలో అంతర్గత రహదారులు చిన్నపాటి వర్షానికే తటాకాలను తలపిస్తున్నాయి. సారపాక-ఇరవెండి ప్రధాన రహదారి దెబ్బతినడంతో గోతులు ఏర్పడి చిన్నపాటి వర్షాలకే గోతుల్లో వరదనీరు చేరి బురదమయంగా మారి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. మసీద్ రోడ్, తాళ్లగొమ్మూరు పంచాయతీలో ప్రధాన రహదారి వైపు రోడ్లు గోతులు పడి నీరు నిల్వడంతో బురదమయంగా మారాయి. అంతర్గత రహదారుల్లో ఉన్న గోతులను తాత్కాలికంగా పూడ్చుతుండటంతో వర్షం పడితే చాలు వరదనీరు నిలిచి ఆ ప్రాంతమంతా తటాకాన్ని తలపించడంతో పాటు అటుగా ప్రయాణించాలంటే వాహనదారులకు నరకప్రాయంగా మారింది. శాశ్వత పరిష్కార మార్గాలు చూడకపోవడంతో అంతర్గత రహదారులు, ప్రధాన రహదారి గోతులతో దర్శనమిస్తూ ఇలా వర్షాకాలంలో వాహనదారులు, పాదచారులకు ఈ రోడ్లపై నడవాలంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి గోతులు పడిన అంతర్గత రహదారులకు మరమ్మతులు చేపట్టి నీరు నిల్వకుండా చూడాలని పారిశ్రామికవాడ ప్రజలు కోరుతున్నారు.

పారిశ్రామికవాడలో తటాకాన్ని తలపిస్తున్న అంతర్గత రహదారులు
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

