భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను మురుసు ముసురుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి భద్రాద్రి జిల్లాపై పెను ప్రభావం చూపింది. నిన్న ఉదయం నుండి జన జీవనం స్తంభించి పోయింది. చిరు వ్యాపారాలు ఇంటికే పరిమితం అయ్యారు.
– నేల కొరిగిన వరి పంట
– తడిసిన పత్తి
– పొంగుతున్న వాగులు
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 04 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను మురుసు ముసురుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి భద్రాద్రి జిల్లాపై పెను ప్రభావం చూపింది. నిన్న ఉదయం నుండి జన జీవనం స్తంభించి పోయింది. చిరు వ్యాపారాలు ఇంటికే పరిమితం అయ్యారు.
పొంగుతున్న వాగులు
రాత్రి నుండి జిల్లాలో భారీ వర్షం కురవడంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇల్లెందు, దమ్మపేట. ములకలపల్లి, అశ్వారావుపేట, మణుగూరు, దుమ్ముగూడెం, చుంచుపల్లి మండలాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్ల పైకి నీరు చేరింది.

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
దెబ్బతిన్న పంటలు
జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన వరి పంట నేలమట్టం అయింది. కోతకొచ్చిన పత్తి చేలు తడిసి ముద్దాయి పోవడంతో దూది అంతా నేలపాలైంది. కొన్నిచోట్ల వరి ధాన్యాన్ని కళ్లాల్లో వేయడంతో తడిసి పాడైపోయాయి.
ప్రజలు అప్రమత్తం గా ఉండాలి : కలెక్టర్ అంకిత్
తుఫాను వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలి. రైతులు కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని భద్రపరచుకోవాలి. వాగుల వద్దకు వెళ్లకూడదు. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలి. కలెక్టరెట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. అధికారులు అందుబాటులో ఉండాలి.

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
US Midterm Elections: వీటో క్యాప్ పోస్టు చేసిన ట్రంప్
Conductor Pravalika | కండక్టర్ ప్రవళిక తల్లికి ఉద్యోగం.. రూ.10లక్షల పరిహారం ప్రకటించిన పొన్నం.. ప్రయాణికురాలిపై హత్య కేసు!
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

