నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
భవిష్యత్‌లో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ను అందించేందుకు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని టీజీ ఎన్పీడీసీఎల్ (TG NPDCL) సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని...
జూలూరుపాడు, అక్టోబర్ 16 : భవిష్యత్‌లో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ను అందించేందుకు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని టీజీ ఎన్పీడీసీఎల్ (TG NPDCL) సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం గ్రామ సమీపంలోని 400 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప కేంద్రంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థ పనితీరు, సరఫరా సామర్థ్యంపై అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాబోయే సీజన్లో విద్యుత్ లోడ్ భారీగా పెరిగే అవకాశం ఉన్నందున, సరఫరాలో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. విద్యుత్ వ్యవస్థలోని అత్యంత కీలకమైన ట్రాన్స్ఫార్మర్లు, ఇతర సాంకేతిక పరికరాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
లోడ్ పెరిగినప్పుడు సాంకేతికంగా తలెత్తే సమస్యలను ముందుగానే అంచనా వేసి, వాటి పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విపత్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే, క్షణాల్లో దానిని పునరుద్ధరించేలా ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తి సమన్వయంతో పనిచేయాలని సీఎండీ దిశానిర్దేశం చేశారు. ఏ పరిస్థితుల్లోనైనా వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే సంస్థ ప్రథమ లక్ష్యంగా సిబ్బంది నిరంతరం శ్రమించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ జి. మహేందర్, కొత్తగూడెం డివిజనల్ ఇంజనీర్ తో పాటు పలువురు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

