కోతుల దాడిలో వృద్ధుడికి తీవ్ర గాయాలు
కోతుల దాడిలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. దడిగల సత్యం అనే వృద్ధుడు తన ఇంటి ఆవరణలో మామిడి చెట్టుకు కోతుల నుండి రక్షణ కోసం వలను ఏర్పాటు చేయడం జరిగింది.
చండ్రుగొండ, మార్చి 26 : కోతుల దాడిలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. దడిగల సత్యం అనే వృద్ధుడు తన ఇంటి ఆవరణలో మామిడి చెట్టుకు కోతుల నుండి రక్షణ కోసం వలను ఏర్పాటు చేయడం జరిగింది. గురువారం కోతులు అటుగా వెళుతూ మామిడి చెట్టుపై ఎక్కడానికి ప్రయత్నించగా పెద్ద కోతులు తప్పించుకోగా చిన్న కోతి పిల్ల వలలో చిక్కుకుంది. కోతి పిల్ల అరవడంతో వృద్ధుడు సత్యం కర్రతో దానిని అదిలించడానికి వెళ్లగా ఒక్కసారిగా కోతుల గుంపు మీద పడి ఒళ్లంతా కరిచాయి. చుట్టుపక్క వారు కర్రలతో కోతులను దూరంగా అల్లించి, వృద్ధుడిని చండ్రుగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందించారు. గ్రామంలో కోతుల సమస్య అధికంగా ఉన్నా పంచాయతీ అధికారులు, పాలకవర్గం పట్టించుకోవడం లేదని వృద్ధుడు, పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కోతుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

