వర్షాకాలం పాములతో జర భద్రం : స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్
భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ జిల్లాలో వర్షాలు కురిసిన వేళ జనావాసాల్లో పాములు అధికంగా తిరుగుతాయని ప్రాణధార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్ అన్నారు. గత రెండు రోజుల్లోనే 7హిల్స్ ఏరియా, ప్యూన్ బస్తీ, రామవరం, బాబుక్యాంప్, బర్మా క్యాంప్, పాల్వంచ ప్రాంతాల్లో..
రుద్రంపూర్, జూన్ 23 : భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ జిల్లాలో వర్షాలు కురిసిన వేళ జనావాసాల్లో పాములు అధికంగా తిరుగుతాయని ప్రాణధార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్ అన్నారు. గత రెండు రోజుల్లోనే 7హిల్స్ ఏరియా, ప్యూన్ బస్తీ, రామవరం, బాబుక్యాంప్, బర్మా క్యాంప్, పాల్వంచ ప్రాంతాల్లో ఆరు విష సర్పాలు, మూఉ విష రహిత సర్పాలను బంధించి అడవిలో వదిలినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. ప్రత్యేకించి వర్షాకాలంలో సర్పాలు ఆహారం, సంతానం కోసం ఎక్కువగా బయటికి వస్తాయని, కావునా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పాములకు మరుగు లేకుండా పనికిరాని వస్తువులు తొలగించాలని, రాత్రులు వెలుగు ఉండేలా చూసుకోవాలన్నారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు కాళ్లకు గమ్ షూస్ ధరించడం, రాత్రుళ్లు టార్చ్ లైట్ తో వెళ్లడం మంచిదని సూచించారు. అవకాశం ఉంటే పామును ఫొటో తీయడం లేదా పాముపై మచ్చలు చెప్పడం వల్ల వెంటనే అప్రమత్తం చేయడానికి వీలు ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

