‘మెడికల్ ఫిట్ అయిన వారసులకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలి’
సింగరేణి సంస్థలో ఉద్యోగాలు పొందాలనే ఆశతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ నాయకులు బుధవారం ఉదయం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా–ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారసులు, వారి కుటుంబ సభ్యులు..
– కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా
రుద్రంపూర్, జూన్ 03 : సింగరేణి సంస్థలో ఉద్యోగాలు పొందాలనే ఆశతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ నాయకులు బుధవారం ఉదయం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా–ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారసులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జున్ రావు మాట్లాడుతూ.. ఉద్యోగంలో ఉన్న సమయంలో అనారోగ్యం, ప్రమాదాలు లేదా ఇతర కారణాలతో కార్మికులు తమ సేవలను కోల్పోయిన సందర్భాల్లో వారి కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో డిపెండెంట్ ఉద్యోగ విధానం అమలులోకి వచ్చిందన్నారు. అయితే మెడికల్ పరీక్షల్లో అర్హత సాధించి, అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకున్నప్పటికీ వందలాది మంది వారసులు నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోందని, కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు భరించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్మిక కుటుంబాల సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే నియామక ప్రక్రియను పూర్తి చేయాలని యాజమాన్యాన్ని కోరారు.సింగరేణి సంస్థ లాభాల సాధనలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, అలాంటి కార్మికుల కుటుంబాలను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. మెడికల్ ఫిట్ అయిన ప్రతి వారసుడికి ఆలస్యం లేకుండా నియామక పత్రాలు అందజేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో మరింత ఉధృతమైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
అనంతరం నాయకులు జనరల్ మేనేజర్ షాలెం రాజు కు వినతిపత్రం అందజేశారు. సమస్యను సానుకూలంగా పరిశీలించిన జీఎం, మెడికల్ ఫిట్ డిపెండెంట్ల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, వైస్ ప్రెసిడెంట్ కత్తెర్ల రాములు, ఆఫీస్ బేరర్లు సందబోయిన శ్రీనివాస్, హుమాయూన్, పిట్ కార్యదర్శులు భూక్యా రమేష్, కమల్, సౌజన్య, సీనియర్ నాయకులు మండల రాజేశ్వరరావు, సురేందర్, మాచర్ల శ్రీనివాస్, కొవ్వూరి రాజేశ్వరరావు, బండారి మల్లయ్య, అప్పారావు, శశివర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.

‘మెడికల్ ఫిట్ అయిన వారసులకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలి’
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

