బూర్గంపహాడ్ : ఉపసర్పంచుల ( Deputy Sarpanches ) డిమాండ్లు నెరవేర్చేంతవరకు ఉద్యమం ఆగదని జిల్లా ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడు, ఇరవెండి ఉపసర్పంచ్ మహంకాళి రామారావు( Mahankali Rama Rao ) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం హలో ఉపసర్పంచ్ -ఛలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో పాల్గొని మాట్లాడారు.
ఉపసర్పంచుల హక్కులకు భంగం కలిగించే విధంగా చెక్ పవర్ ( Check Power ) రద్దుచేస్తున్నారనే వార్తలను ఆయన ఖండించారు. ఉప సర్పంచులకు నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం, వార్డుసభ్యులకు రూ.3 వేలు గౌరవవేతనం పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గ్రామాల్లో చేపట్టే అభివద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలపై ఉపసర్పంచుల పేర్లను పొందుపర్చాలన్నారు. గ్రామపంచాయతీల బలోపేతం, ప్రజాప్రతినిధుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, పెండింగ్ డిమాండ్లను తక్షణమే అమలుచేయాలని కోరారు.