మహిళలు సమాజానికి వెన్నుముక లాంటి వారు.. ఆకెనపల్లి సర్పంచ్ గాదె స్రవంతి సుధాకర్
మహిళలు సమాజానికి వెన్నుముక లాంటివారని అంతర్గాం మండలం ఆకేనపల్లి గ్రామ సర్పంచ్ గాదె స్రవంతి సుధాకర్ అన్నారు. ఆకేనపల్లి గ్రామపంచాయతి కార్యాలయంలో అదివారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.
అంతర్గాం, మార్చి 8 : మహిళలు సమాజానికి వెన్నుముక లాంటివారని అంతర్గాం మండలం ఆకేనపల్లి గ్రామ సర్పంచ్ గాదె స్రవంతి సుధాకర్ అన్నారు. ఆకేనపల్లి గ్రామపంచాయతి కార్యాలయంలో అదివారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసీ స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఆకాశంలో సగమై, అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగివున్న మహిళా లోకానికి అన్ని రంగాల్లో పురుషునితో సమానమైన అవకాశాలను మరింతగా అందించినప్పుడు మాత్రమే కుటుంబాభివృద్ధి సంపూర్ణ మవుతుందని అన్నారు. మహిళలు శారీరకంగా ధృడంగా ఉన్నప్పుడే వారు ఎలాంటి కుంగుబాట్లకు లోనుకారన్నారు.
మహిళలు బాలికలు స్వేచ్ఛగా నిర్భయంగా జీవించినప్పుడే సురక్షిత సమాజం అవిర్భవిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ రమేష్, జీపీవో శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఐలవేణి అనసూర్య, వార్డు సభ్యులు మర్రి రాజ్ కుమార్, ఉప్పులేటి మల్లమ్మ, మెండే కవిత, ఉప్పులేటి పద్మ, మాజీ సర్పంచ్ గంగాధరి శ్రీనివాస్ గౌడ్, మంథని మహేందర్, ఎఎన్ఎం సరిత, అంగన్వాడీ టీచర్ సున్నం విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

