విద్యాభివృద్ధికి టీఎల్ఎం మేళా దోహదం
టీఎల్ఎం మేళా విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు పేర్కొన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రెండురోజుల మండల స్థాయి టీఎల్ఎం మేళా బుధవారం ముగిసింది.
- డీఈవో జనార్దన్‌రావు
- హుజూరాబాద్, వీణవంకలో మండల స్థాయి ప్రదర్శనల ముగింపు కార్యక్రమానికి హాజరు
హుజూరాబాద్‌టౌన్, జనవరి 4: టీఎల్ఎం మేళా విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు పేర్కొన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రెండురోజుల మండల స్థాయి టీఎల్ఎం మేళా బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి డీఈవో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఉపాధ్యాయులు విద్యా బోధన మరింత మెరుగుపరచుకునేందుకు, పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు టీఎల్ఎం పద్ధతి ఉత్తమమైందన్నారు. ఉపాధ్యాయులు బోధనోపకరణాల సహాయంతో బోధిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. మండల స్థాయిలో ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనోపకరణాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి జిల్లాస్థాయికి పంపించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక ఉపాధ్యాయుడి లక్ష్యం మెరుగైన విద్యా బోధనగా ఉంటే విద్యారంగంలో సత్ఫలితాలు వస్తాయని చెప్పారు.
మండల విద్యాధికారి కేతిరి వెంకట నరసింహారెడ్డి మాట్లాడుతూ, హుజూరాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు నూతన రీతిలో బోధనోపకరణాలను తయారు చేశారని అభినందించారు. 2022లో సెలవులను వినియోగించుకోకుండా విద్యాబోధన చేసిన బోర్నపల్లి పీఎస్ ఉపాధ్యాయుడు ఏ సురేశ్‌ను ఉత్తమ టీచర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంఎన్‌వో సదానందం, స్కూల్ కాంప్లెక్స్‌ల హెచ్ఎంలు ఊరుకొండ సత్యప్రసాద్, కే అనురాధ, ఎస్ అంజయ్య, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వీణవంకలో టీఎల్ఎం మేళా సందర్శన
వీణవంక, జనవరి 4: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కాంప్లెక్స్ హెచ్ఎం పులి అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీఎల్ఎం మేళాను బుధవారం జిల్లా విద్యాధికారి సీహెచ్‌వీఎస్ జనార్దన్‌రావు సందర్శించారు. ఎగ్జిబిట్లను పరిశీలించారు. అనంతరం టీఎల్ఎం ముగింపు సమావేశంలో ఉత్తమ బోధనోపకరణాలు రూపొందించి జిల్లా స్థాయికి ఎంపికైన ఉపాధ్యాయులు వై బాలాజీ, ఎస్ అనిత, సీహెచ్ హైమావతి, ఏ సునీత, జే ఎల్లయ్యకు జిల్లా విద్యాధికారి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో విడపు శ్రీనివాస్, మండల నోడల్ ఆఫీసర్ ఎస్ శోభారాణి, కాంప్లెక్స్ నోడల్ అధికారులు ఎం చంద్రకళ, వేణుగోపాలస్వామి, డీఆర్పీలు బాలాజీ, ఐ శ్రీనివాస్, ఆర్పీలు తిరుపతిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సునీత, అజయ్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

