Vemulawada | అరగంటే సమయమిచ్చారట.. ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందించిన అధికారులు
నలుగురిలో నాగుబాటు అయినా నాకేమిటి సిగ్గు అన్నట్టుగా ఉంది వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అధికారుల తీరు. ఆసుపత్రి అంటేనే అత్యవసరాలకు నిలయం. అలాంటి వేములవాడ ఏరియా ఆసుపత్రి ఆవరణలో సినిమా షూటింగ్ అనుమతి ఇవ్వడం అంటే రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే.
- సినిమా షూటింగ్‌పై వేములవాడ ఏరియా ఆసుపత్రి అధికారుల వివరణ
Vemulawada | వేములవాడ, నవంబర్ 28 : నలుగురిలో నాగుబాటు అయినా నాకేమిటి సిగ్గు అన్నట్టుగా ఉంది వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అధికారుల తీరు. ఆసుపత్రి అంటేనే అత్యవసరాలకు నిలయం. అలాంటి వేములవాడ ఏరియా ఆసుపత్రి ఆవరణలో సినిమా షూటింగ్ అనుమతి ఇవ్వడం అంటే రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే. సినిమా షూటింగ్ సెట్టింగ్‌లు వేసుకొని చేస్తుండగా అత్యవసర పరిస్థితులలో వచ్చిన రోగులను కూడా లోనికి గురువారం రావద్దంటూ సదరు సినిమా యూనిట్ బృందం అడ్డుకుంది. కాగా రోగుల నుండి వ్యతిరేఖత వచ్చింది. అలాగే ఈ విషయంపై ‘నమస్తేతెలంగాణ’ కథనాన్ని ప్రచురించింది. దీంతో అసలు సినిమా షూటింగ్ కు ఎవరూ అనుమతిచ్చారంటూ ఆరా తీయగా ఈ వ్యవహారం కాస్తా జిల్లా కలెక్టర్ వరకు చేరింది. అసలు సినిమా షూటింగ్ వ్యవహారమే తన దృష్టికి రాలేదని ఎవరు అనుమతి ఇచ్చారంటూ సదరు అధికారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో 15 నిమిషాల్లో యూనిట్ బృందం ఆసుపత్రిని ఖాళీ చేసిన విషయం తెలిసిందే.
ఇక అధికారులు మాత్రం ఒక అరగంట సమయం సరిపోతుందని అడిగితే ఉదయం 6గంటల నుండి 7గంటల వరకు సమయమిచ్చామని చెబుతున్న తీరు విడ్డూరంగా ఉంది. మధ్యాహ్నం వరకు షూటింగ్ నిర్వహించగా జిల్లా పాలన అధికారి దృష్టికి వెళ్లగా సుమారు మూడు గంటల సమయంలో యూనిట్ బృందం అక్కడి నుంచి చిత్తగించారు. పైగా రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పామని, అత్యవసర సేవలు ఇతర సేవలకు ఎలాంటి అభ్యంతరం కలవకుండా చూశామని మరీ వివరణ ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం. ఏది ఏమైనా ప్రభుత్వ ఆసుపత్రిలో సినిమా షూటింగ్ అనుమతి ఇవ్వడంపై సర్వత్ర ప్రజల నుండి కూడా విమర్శలు వస్తున్నాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘న్యాయవాద వృత్తిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో ముఖ్యం’
రేవంత్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ.. ‘బావర్చి’ కేసులో కాంగ్రెస్ సర్కార్‌కు హైకోర్టు మొట్టికాయలు
గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
KCR Deeksha Divas | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్-దీక్షా దివస్.. ఉద్యమ స్పూర్తిని చాటిన ప్రవాస తెలంగాణ బిడ్డలు
నల్లగొండను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

