Putta Madhukar | మంథనిలో దుద్దిళ్ల రాజ్యాంగాన్నే నడిపిస్తుండ్లు.. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మంథని నియోజకవర్గంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ దుద్దిళ్ల రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. మంథని పట్టణంలోనీ సంగీత నృత్య కళాశాలను సందర్శించి రెండు రోజుల క్రితం సంగీత నృత్యకళాశాల భవనం ప్రారంభోత్సం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ ఒక్కడి పేరు మాత్రమే ఉండటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
- రాజ్యాంగం…అంబేద్కర్‌ను అవమానించిన చరిత్ర దుద్దిళ్ల కుటుంబానిదే
- దుద్దిళ్ల శ్రీధర్ పేరుతో శిలాఫలకం పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే
- మంథని మూలాలు కనబడకుండా చేసి రాజ్యామేలాలని చూస్తుండ్లు
- ఎంపీ స్పందిస్తే రాత్రికి రాత్రే శిలాఫలకం పెట్టించిన దుద్దిళ్ల శ్రీధర్
- శిలాఫలకం ఏర్పాటుపై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఫైర్
Putta Madhukar | మంథని, నవంబర్ 27 : మంథని నియోజకవర్గంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ దుద్దిళ్ల రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. మంథని పట్టణంలోనీ సంగీత నృత్య కళాశాలను సందర్శించి రెండు రోజుల క్రితం సంగీత నృత్యకళాశాల భవనం ప్రారంభోత్సం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ ఒక్కడి పేరు మాత్రమే ఉండటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంగీత నృత్యకళాశాల భవనం దుద్దిళ్ల శ్రీధర్ తాత తండ్రుల ఆస్తులతో కట్టలేదని, ప్రజలు చెల్లించిన పన్నులతో నిర్మించారని ఆయన అన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఒక్క రోజు ముందే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా దుద్దిళ్ల శ్రీధర్ వ్యవహరించారని ఆయన విమర్శించారు. దుద్దిళ్ల కుటుంబం ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగాన్ని అవమానిస్తారని అన్నారు. రాజ్యాంగం రాకముందు దుద్దిళ్ల కుటుంబ కులం వాళ్లు జుట్టు పన్ను, రవిక పన్ను విధించారని, అలాగే మాట్లాడే, జీవించే మంచినీళ్లు తాగే హక్కు లేకుండా చేశారని ఆయన గుర్తు చేశారు. 80ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత దర్జాగా రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్నది దుద్దిళ్ల కుటుంబమేనని ఎద్దేవా చేశారు.
రాజ్యాంగం చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున డిల్లీలో తిరుగుతూ రాజ్యంగ మే మా గుండె అని గుండెలో పెట్టుకున్న ప్రియాంక గాంధీ ఈ విషయంపై జవాబు చెప్పాలన్నారు. అధికారం కోసం రాజ్యాంగం పట్టుకుని తిరిగి అదికారం వచ్చినంక తెలంగాణాలో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న దుద్దిళ్ల కుటుంబానికే దక్కుతుందన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు స్పందిస్తే రాత్రికి రాత్రి మరో శిలాఫలకం లోపల ఏర్పాటు చేశారని, భవనం ముందు ఉన్న రాజుగారి శిలాఫలకం చెరిపివేయకుండా దుద్దిళ్ల శ్రీధర్ రాజై పరిపాలిస్తుండని అన్నారు. నియోజకవర్గంలో రాజ్యాంగం ఎక్కడ అమలు అవుతుందో ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలన్నారు. ఇక్కడ మహిళా భవనం ఉండేదని, మహిళా లోకానికి స్పూర్తిగా సత్యభామ నిలిచారని, ఈ భవనం మహిళా చైతన్యానికి ఉపయోగపడ్డదన్నారు. కానీ మహిళా భవనం, సత్యభామ, చంద్రకళ లాంటి పేర్లు కనబడకుండా చేసి తన పేరుతో మాత్రమే శిలాఫలకం ఏర్పాటు చేసుకోవడం విడ్డూరమన్నారు. మంథని మూలాలను కనబడనీయకుండా చరిత్ర కనబడకుండా చేసి రాజ్యామేలుతున్నారని, పురాతణమైన మున్సిపల్ కార్యాలయం, బాలికల హస్టల్ లాంటివి తొలగించారని అన్నారు. సారా నిషేధం గురించి మహిళా చైతన్యం గురించి పోరాటం చేసిన మహిళభవనం పేరును మార్చి మా అయ్య తీసుకువచ్చిన పేరు ఉండాలని సంగీత కళాశాల పేట్టించాడని విమర్శించారు.
దుద్దిళ్ల శ్రీధర్ అయ్యకు చరిత్ర ఏమీ లేదని, అన్నం పెట్టిన చదువు చెప్పించిన బ్రిడ్జి కట్టించిన చరిత్ర లేకున్నా ప్రతిదానికి వాళ్ల అయ్య పేరు ఉండాలని కంకణం కట్టుకున్నాడని విమర్శించారు. మంథనిలో మున్సిపాలిటికి పాలకవర్గం ఉందని ఒక బీసీ సామాజికి వర్గానికి చెందిన చైర్మన్ ఉన్నాడని, అయినా బీసీలను ఎస్సీలను కనబడనీయవద్దనే, ఎదుగనీయవద్దనే ఆలోచన దుద్దిళ్ల కుటుంబానిదన్నారు. ఆనాడు మార్కెట్ కమిటి ఓపెన్ అయితే చైర్మన్‌గా ఉన్న సత్యనారాయణరాజు పెరు పెట్టకుండానే శ్రీపాదరావు ఓపెన్ చేశాడని, ఈనాడు మున్సిపల్ చైర్మన్ ఉన్నా కూడా ఆయన పేరు పార్లమెంట్ సభ్యుడి పేరు పెట్టకుండా భవనాలు ఓపెన్ అవుతున్నాయంటే ఇక్కడ రాజ్యాంగం ఏ విధంగా నడుస్తుందో ఆలోచన చేయాలన్నారు. ఈ ప్రాంతానితో మీ కుటుంబానికి ఏ సంబంధం లేకున్నా ప్రతి దానికి మీ అయ్య పేరు ఎందుకు పెడుతున్నావో జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎందుకు నీ ఒక్కడి పేరు ఉండాలో చెప్పాలని ఎంపీ వంశీకృష్ణ, మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ పేర్లు ఎందుకు పెట్టకూడదో చెప్పాలన్నారు. మీ సొంత పైసలతో కట్టుకునే వాటికి మీ పేర్లు పెట్టుకోవాలే తప్ప ప్రజల కష్టార్జితంతో పన్నులతో కట్టే వాటికి ఎలా మీ పేర్లు పెడుతారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అనుసరించి బతుకుతున్న బిడ్డలుగా ఇలాంటి విషయాలను ఉపేక్షించమని, దీనిపై మేధావులు, ప్రతి ఒక్కరు స్పందించాలని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మాపై ఉందని, తక్షణమే ఈ శిలాఫలకం తొలగించి ప్రోటోకాల్ ప్రకారం అందరి పేర్లు ఉండాలే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | ఘోరం.. ఇనుపకడ్డీలు మీదపడి డిగ్రీ విద్యార్థిని మృతి
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక అంశాలకు ఆమోదం.. పెనుకొండలో కియా ప్లాంట్-2కు పచ్చ జెండా
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

