Sports school admissions | క్రీడల్లో రాణించాలనుకొనే విద్యార్థులకు సదావకాశం.. స్పోర్ట్స్ స్కూల్లో నాలుగు, ఐదో తరగతులకు ప్రవేశాలు
రాష్ట్రంలో మూడు ప్రాంతీయ క్రీడా పాఠశాలలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లా హకీంపేట, క రీంనగర్, ఆదిలాబాద్‌లో స్పోర్ట్స్ స్కూళ్లు ఉ న్నాయి. 2023-24 విద్యాసంవత్సరానికి నా లుగు, ఐదో తరగతిలో ప్రవేశాలకు ఎంపిక తేదీలను అధికారులు ప్రకటించారు.
- హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లో క్రీడాపాఠశాలలు
- విద్యార్థులకు క్రీడలతోపాటు నాణ్యమైన విద్య, వసతి
- మూడు స్కూళ్లలో బాలబాలికలకు 240 సీట్లు
- వచ్చే నెల ఒకటి నుంచి మండల స్థాయిలో, 9న జిల్లా స్థాయి, 24న రాష్ట్ర స్థాయిలో ఎంపిక పోటీలు
Sports school admissions | చదువుతోపాటు క్రీడల్లో మెరికల్లా తయారు కావాలనుకునే చిన్నారులకు ఇదో అరుదైన అవకాశం. అందుకు క్రీడా పాఠశాల మంచి వేదిక. రాష్ట్రంలోని మూడు పాఠశాలల్లో 240 (బాలురు 120, బాలికలు 120) సీట్ల కోసం ప్రభుత్వం ఏటా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నది. ఎంపికైన విద్యార్థులకు ఆటల్లో శిక్షణ ఇస్తూనే పదో తరగతి వరకు ఉచిత విద్య, వసతి కల్పిస్తున్నది. అందుకు సంబంధించి నాలుగు, ఐదో తరగతుల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల ఒకటి నుంచి ఎంపిక పోటీలు మొదలు కానుండగా, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అర్హత పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు అవకాశం కల్పించనున్నది.
కరీంనగర్ స్పోర్ట్స్, జూన్ 23 : రాష్ట్రంలో మూడు ప్రాంతీయ క్రీడా పాఠశాలలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లా హకీంపేట, క రీంనగర్, ఆదిలాబాద్‌లో స్పోర్ట్స్ స్కూళ్లు ఉ న్నాయి. 2023-24 విద్యాసంవత్సరానికి నా లుగు, ఐదో తరగతిలో ప్రవేశాలకు ఎంపిక తేదీలను అధికారులు ప్రకటించారు. ఒక్కో పాఠశాలలో 80 సీట్లు ఉండగా, నాలుగో తరగతిలో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు, ఐదో తరగతిలో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం అర్హత పరీక్షలను నిర్వహిస్తారు. విద్యార్థులకు కొన్ని శారీరక సామర్ధ్యానికి సంబంధించిన పరీక్షలు చేసి, ప్రతిభ చూపిన వారికి క్రీడాపాఠశాలల్లో అవకాశం ఇస్తారు. తర్వాత వారిని హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలకు పంపిస్తారు. ఎంపికైన విద్యార్థులకు రెండే ళ్ల పాటు (4, 5) తరగతుల్లో ప్రత్యేక వ్యాయామాలు నేర్పించి, వారి శరీరాలను క్రీడలకు అనువుగా మారుస్తారు. అనంతరం వారు ఏ ఆటలో రాణించే అవకాశముంటుందో అందు లో నిపుణులైన కోచ్‌లతో శిక్షణ ఇప్పిస్తారు. ఎంపిక పోటీలను జిల్లాల వారీగా క్రీడాశాఖ అధికారులు నిర్వహిస్తారు.

తీసుకురావాల్సిన పత్రాలు
ఎంపిక పోటీలకు హాజరయ్యే విద్యార్థులు తమ వయసు ధ్రువీకరణ పత్రం (పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి జారీ చేసినవి) తీసుకురావాలి. మరో రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, మూడు, నాలుగో తరగతి పాస్ ధ్రువీకరణ పత్రాలతో పోటీలకు హాజరుకావాలి.
మూడు స్థాయిల్లో ఎంపిక
మూడు స్థాయిల్లో అర్హత పరీక్షలను నిర్వహించి విద్యార్థులను స్పోర్ట్స్ స్కూళ్లకు ఎంపిక చేస్తారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఎంఈవో ఆధ్వర్యంలో మండలస్థాయిలో నిర్వహిస్తారు. సామర్థ్య పరీక్షల్లో కనీసం 10 పాయింట్లు సాధిస్తే జిల్లా స్థాయి ఎంపిక పో టీలకు ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక పోటీలను 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జిల్లా క్రీడాశాఖ ఆధికారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లోనే నిర్వహించనున్నారు. ఇక్కడ కూడా శారీరక సా మర్థ్య పరీక్షల్లో కనీసం 10 పాయింట్లు సాధిస్తే రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలకు అనుమతిస్తారు. చివరగా రాష్ట్ర స్థాయిలో 24 నుంచి 30 వరకు హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ఎంపిక పోటీలను నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు నాలుగు, ఐదో తరగతుల సంబంధించి ఆగస్ట్ చివరి వారంలో ప్రవేశాలు కల్పిస్తారు.
నాలుగో తరగతిలో ప్రవేశాలకు 2014 సెప్టెంబర్ 1 నుంచి 2015 ఆగస్టు 31 మధ్య కాలంలో జన్మించి ఉండాలి. అలాగే ఐదో తరగతిలో ప్రవేశాలకు హజరయ్యే విద్యార్థులు 2013 సెప్టెంబర్ 1 నుంచి 25014 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి.
సామర్థ్య పరీక్షలు
విద్యార్థులకు ఎత్తు, బరువు, 30 మీటర్ల ప్లయింగ్ స్టార్ట్, 60 మీటర్ల షటిల్ రన్, 800 మీటర్ల రన్నింగ్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, ప్లెక్సిబిలిటీ టెస్ట్, మెడిసిన్ బాల్‌త్రో, వర్టికల్ జంప్ తదితర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేస్తారు.
వీరు అనర్హులు
దొడ్డి కాళ్లు, ప్లాట్ పీట్, వెన్నుముక వంగి ఉన్నవారు, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు, బౌలెగ్స్ కలిగిన వారు, శరీరంలో ఎముకలు విరిగిన విద్యార్థులు ప్రవేశాలకు అనర్హులు.
విద్యార్థులకు మంచి అవకాశం
విద్యార్థులను చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సహించాలి. చిన్ననాటి నుంచే క్రీడల్లో రాణించాలనుకునే పిల్లలకు స్పోర్ట్స్ స్కూల్ ఒక మంచి అవకాశం. ఇక్కడ క్రీడలతో పాటు మంచి విద్య, వసతి ఉంటుంది. పిల్లలు ఉన్నతంగా ఎదిగే అవకాశమున్నది. ఎంతో మంది స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను సులువుగా రాణించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడ్డారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడలపై దృష్టిసారించేలా చేస్తే వారు జీవితంలో ఉన్నతస్థానాలకు ఎదుగుతారు. స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల కోసం వచ్చే నెల ఒకటి నుంచి నిర్వహించే ఎంపిక పోటీలను సద్వినియోగం చేసుకోవాలి. సందేహాలుంటే 99485 87555 నెంబర్లో సంప్రదించవచ్చు.
-కీర్తి రాజవీరు, జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి (కరీంనగర్)
విద్యార్థులకు సదావకాశం
చిన్ననాటి నుంచి శారీరకంగా, మానసికంగా అభివృద్ధి సాధించేందుకు, క్రమశిక్షణను అలవర్చుకోవడానికి సీఎం కేసీఆర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణను ఎర్పాటు చేయడం సంతోషకరం. విద్యార్థులకు చదువుతోపాటు ఆటల్లో తర్పీదునిచ్చి రాష్ర్టానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చేందుకు ఈ ఎంపిక దోహదపడుతుంది. ఎంతో మంది స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను సులువుగా రాణించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడ్డారు. చిన్ననాటి నుంచే క్రీడల్లో రాణించాలనుకునే వారికి క్రీడా పాఠశాల ఒక మంచి అవకాశం. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఎంతో మంచి చాన్స్ ఇది.
– దేవతా ప్రభాకర్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

