మా ఊర్లోకి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావద్దు
తమ గ్రామంలోకి ప్రైవేట్ పాఠశాలల బస్సులు రావద్దని కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామ మహిళలు గురువారం అడ్డుకొని వాపస్ పంపించారు.
కథలాపూర్, జూన్ 20 : తమ గ్రామంలోకి ప్రైవేట్ పాఠశాలల బస్సులు రావద్దని కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామ మహిళలు గురువారం అడ్డుకొని వాపస్ పంపించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు 72 మంది విద్యార్థులు, 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. గ్రామానికి చెందిన విద్యార్థులు వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో 100 మంది చదువుకుంటున్నారు.
ఇలా అయితే గ్రామ ప్రభుత్వ పాఠశాల మూసేసే పరిస్థితులు వస్తాయని మహిళలందరూ సమావేశమై గ్రామానికి ప్రైవేట్ పాఠశాలల బస్సులను రానీయవద్దని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం వాటిని అడ్డుకున్నారు. గ్రామంలోని విద్యార్థులను స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని నిర్ణయించారు. సుమారు రెండు గంటల పాటు గ్రామస్తులు, మహిళలు గ్రామశివారులో రోడ్డుపై నిలబడి ప్రైవేట్ పాఠశాలల బస్సులు రాకుండా చూశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

