Godavarikhani | గోదావరిఖనిలో జరిగే సింగరేణి కార్మిక గర్జనను విజయవంతం చేయాలి.. టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి
సింగరేణి కార్మికులు చెమటోడ్చి బొగ్గు ఉత్పత్తి చేస్తే సంస్థకు వచ్చిన లాభాలను ఇప్పటివరకు కూడా ప్రకటించకపోవడం దారుణమని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అన్నారు. రామగుండం డివిజన్-1 పరిధిలోని జీడీకే 11 గనిలో దాదాపు 150 మంది యువ కార్మికులు శుక్రవారం టీబీజీకేఎస్‌లో చేరిన సందర్భంగా గనిపై వారికి కండువాలు కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.
- సింగరేణి సంస్థ లాభాలను వెంటనే ప్రకటించి 36శాతం వాటాను కార్మికులకు చెల్లించాలి
Godavarikhani | గోదావరిఖని : సింగరేణి కార్మికులు చెమటోడ్చి బొగ్గు ఉత్పత్తి చేస్తే సంస్థకు వచ్చిన లాభాలను ఇప్పటివరకు కూడా ప్రకటించకపోవడం దారుణమని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అన్నారు. రామగుండం డివిజన్-1 పరిధిలోని జీడీకే 11 గనిలో దాదాపు 150 మంది యువ కార్మికులు శుక్రవారం టీబీజీకేఎస్‌లో చేరిన సందర్భంగా గనిపై వారికి కండువాలు కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. గత రెండు సంవత్సరాలలో సంస్థ అభివృద్ధి పేరిట పక్కన పెట్టిన నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు. సింగరేణిలో గత సంవత్సరంలో ఓఎంఎస్ గణనీయంగా పెరిగిందని సంస్థ లాభాలు కూడా పెరుగుతాయని ఎదురుచూస్తున్నామన్నారు. లాభాలను ప్రకటించి వెంటనే కార్మికులందరికీ 36శాతం వాటాను పంచాలన్నారు. సింగరేణి సంస్థకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.60 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కావాలని సంస్థ ప్రొడక్షన్‌ని తగ్గిస్తూ సంస్థను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
అక్టోబర్ 14న గోదావరిఖనిలో జరిగే సింగరేణి కార్మిక గర్జనను విజయవంతం చేయాలని ఈ కార్యక్రమానికి బి ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని, యువ కార్మిక సోదరులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి మాట్లాడుతూ నెలకు మూడు బోర్డులను నిర్వహించి వంద శాతం మంది కార్మికులను అన్ పిట్ చేస్తామని చెప్పిన సంఘాలు కనీసం సంవత్సర కాలంగా మెడికల్ బోర్డులు సక్రమంగా నిర్వహించట్లేదన్నారు. వెంటనే ప్రతీ నెల మూడు బోర్డులు నిర్వహించి అనారోగ్యంతో ఉన్న కార్మికుల అందరిని అన్పిట్ చేయాలని డిమాండ్ చేశారు. కనీసం కార్మికులకు సేఫ్టీ పనిముట్లు బూట్లు డ్రిల్ బిట్లు అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఉత్పత్తి కావాల్సిన వస్తువులను అందించాలని వారన్నారు.
అదేవిధంగా కార్మికులు ఎదుర్కొంటున్న 11 ఇంక్లైన్ రోడ్డును మరమ్మత్తు చేయాలని, గనిపై కార్మికులు ఎదుర్కొంటున్న నీరు క్యాంటీన్ తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని పేర్కొన్నారు. గుర్తింపు ప్రాతినిత్య సంఘాల కాలపరిమితి పూర్తయిందని అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. దాదాపు 150 మంది యువ కార్మికులను టీబీజీకేఎస్ సంఘంలోకే కండువా కప్పి ఆహ్వానించారు. జీడీకే-11 ఇంక్లైన్ టీబీజీకేస్ పిట్ సెక్రెటరీ వాసర్ల జోసఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర కోశాధికారి చెల్పూరి సతీష్, మొదుంపల్లి రాజేశం, మాసాడి సాయి చరణ్, పల్లె సురేందర్, అంబటి శ్రీనివాస్, చండ్రు శ్రీనివాస్, జనగామ ప్రమోద్, ధర్మాజీ క్రుష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

