Ramunipalli | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 5: పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రామునిపల్లి గ్రామంలోని ఆలయంలో సీతా రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల ను వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు భాగంగా నాగవెల్లి, పుష్ప యాగం, సప్తవర్ణాలు, తీర్త ప్రసాదం వినియోగం. పండిత సన్మానం, తదితర కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో రామునిపల్లి సర్పంచ్ అనసూర్య, ఉప సర్పంచ్, పాలక వర్గం, కనుకుల సర్పంచ్ కర్రె కవిత, అర్చకులు. ఎస్ ప్రసాదచార్యులు, కాండూరి వాసు, అనిల్ కుమార చార్యులు, సంతోష్, శంకర్ శర్మ, భక్తులు పాల్గొన్నారు.