రెండో డోస్‌ను త్వరగా పూర్తి చేయాలి

- ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు బూస్టర్ డోస్ ఇవ్వాలి
- కలెక్టర్ ఆర్వీ కర్ణన్
విద్యానగర్, జనవరి 10: కొవిడ్ రెండో డోస్ వ్యాక్సినేషన్‌ను వందశాతం పూర్తి చేయాలని, వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు బూస్టర్ డోస్ అందించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఒమిక్రాన్‌పై నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కొవిడ్ రెండో డోస్ వ్యాక్సినేషన్ 6 శాతం మిగిలి ఉందని, దీన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో పాటు 60 ఏళ్లు పైబడి అనారోగ్యంతో ఉన్న వృద్ధులకు బూస్టర్ డోస్ అందించాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు, కరోనా పరీక్షలకు సంబంధించిన కిట్లు, మాసులు అందుబాటులో ఉంచాలని సూచించారు. కొత్తపల్లి, తిమ్మాపూర్ పీహెచ్‌సీల పరిధిలో రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

