అన్యాయాన్ని సహించలేకపోయా
‘తెలంగాణ భాష, సాహిత్యానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయా. సాహిత్యంలో ప్రముఖ కవి నన్నయ అంటూ సాగిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టినా. కవితలు, బహిరంగ సభల ద్వారా పాల్కురికి సోమనాథుడన్నది ప్రజలకు వివరించా’ అని ప్రముఖ కవి, రచయిత జూకంటి జగన్నాథం పేర్కొన్నారు.
- సాహిత్యంలో జరిగిన దుష్ప్రచారాన్ని నా రచనలతో తిప్పి కొట్టా
- దాశరథి అవార్డు మరింత బాధ్యతను పెంచింది
- ప్రముఖ కవి, రచయిత జూకంటి జగన్నాథం
రాజన్న సిరిసిల్ల, జూలై 22 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ భాష, సాహిత్యానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయా. సాహిత్యంలో ప్రముఖ కవి నన్నయ అంటూ సాగిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టినా. కవితలు, బహిరంగ సభల ద్వారా పాల్కురికి సోమనాథుడన్నది ప్రజలకు వివరించా’ అని ప్రముఖ కవి, రచయిత జూకంటి జగన్నాథం పేర్కొన్నారు. తన మూడున్నర దశాబ్దాల ప్రస్థానంలో కథా, రచయిత, కవిగా అనేక రచనలు చేశానని గుర్తు చేసుకున్నారు. దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఏటా ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక ‘శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు’కు ఇటీవల ఎంపికయ్యారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
కవిగా ప్రస్థానం ఎలా మొదలైంది?
జూకంటి: మా సొంతూరు తంగళ్లపల్లి. బాల్యంలో ఇక్కడే చదువుకున్న. చిన్నప్పటి నుంచే దినపత్రికలు, నవలలు చదవడం అంటే ఆసక్తి. నాలుగు కిలోమీటర్ల దూరంలోని సిరిసిల్లకు వెళ్లి లైబ్రరీలో పుస్తకాలు తెచ్చుకుని చదువుకునేది. సిరిసిల్లకు చెందిన జక్కని వెంకట్రాజం ప్రోత్సాహంతో కవితలపై ఆసక్తి పెరిగింది. సిరిసిల్ల ప్రజా పోరాటాలు, కల్లోల పరిస్థితులు ప్రభావం చూపాయి. దాంతో కవితలు రాయడం మొదలు పెట్టాను. మొట్టమొదటి కవితా సంకలనం 1993లో రాశా. తర్వాత ప్రపంచీకరణపై ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1996లో కవితా సంకలనం రాశా. అప్పటి నుంచి వరుసగా కవితలు, రచనలు, సామాజిక అంశాలతో పాటు ప్రజల జీవితాలను కవిత రూపంలో రాశా.
ప్రజల్ని ఎలా చైతన్యం చేశారు?
సిరిసిల్ల మెట్ట ప్రాంతం. నేను సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థలో ఉద్యోగంలో చేరా. ఈ ప్రాంతంలో సాగునీటి వనరులు లేక పోవడం వల్ల విద్యుత్ వినియోగంపైనే వ్యవసాయ రంగం ఆధార పడింది. కరువు, దుర్భిక్ష పరిస్థితులు కండ్లలో తిరిగేవి. దాంతోపాటు తెలంగాణ భాష, సాహిత్యానికి జరుగుతున్న అన్యాయం సహించలేకపోయా. తెలంగాణ సాహిత్యంలో ప్రముఖ కవి నన్నయ అంటూ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టినా. కవితలు, బహిరంగ సభల ద్వారా పాల్కురికి సోమనాథుడన్నది ప్రజలకు వివరించాం. దాంతో తెలంగాణ ప్రజలు సోమనాథుడిని గుర్తించగలిగారు. తెలంగా ణ ఉద్యమంలో ప్రజలను నడిపించేలా కవితలతో ప్రయత్నం చేశా.
మీ రచనల గురించి చెబుతారా..?
ముఖ్యంగా నేను ప్రపంచీకరణమీదే ఎక్కువ దృష్టిపెట్టి కవితలు రాశాను. 1993లో మొదటి కవితా సంకలనం పాతాళ గరిగెను విడుదల చేశా. ఆ తర్వాత పదహారుకుపైగా పుస్తకాలు వచ్చాయి. కన్నడ, తమిళం, హిందీ, ఇంగ్లిష్‌లోకి నా కవితలు అనువాదం అయ్యాయి. అందులో అన్ని సంతృప్తినిచ్చాయని చెప్పవచ్చు. అన్నింటికీ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సమాజంలో ప్రపంచీకరణతో బిచ్చగాళ్లను మరింత బిచ్చగాళ్లను చేసింది. ధనవంతులను మరింత ధనవంతుల్ని చేసింది. వ్యవసాయం రైతులను కూలీలను చేసింది. కూలీలను గ్రామాల నుంచి తరిమేసి బడా బాబులను బతికించింది. ప్రపంచ బ్యాంకు అప్పులిచ్చి పాలకులను బానిసలుగా చేసే కుట్రలను ఎండగడుతూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రాశా. గంగడోలు ఇలా అన్నీ నాకు తృప్తినిచ్చాయి. అందరి ప్రశంసలు అందుకున్నా. నేటి సమాజంలో సమాన స్థాయిలో అభివృద్ధి జరగాలన్నదే తన లక్ష్యం. అలక్ష్యం మేరకు కవితలు, రచనల ద్వారా నా అభిప్రాయాన్ని నిర్భయంగా రాస్తున్నా.
దాశరథి అవార్డు రావడంపై ఎలా ఫీలవుతున్నారు?
నేను 2014 నుంచి ఆలిండియా తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నా. 1998లో మొదటిసారి సినారె కవితా పురస్కారం అందుకున్నా. తర్వాత నాకు అవార్డులు చాలా వచ్చాయి. ఇప్పుడు దాశరథి కృష్ణమాచార్య రాష్ట్ర స్థాయి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నందుకు మరింత ఆనందపడుతున్నా. నాకొచ్చిన ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచింది. అవార్డు కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సామాజిక ఉద్యమాలే ప్రేరణగా ఆధి పత్యాన్ని ప్రశ్నిస్తూనే కవితలు రాస్తుంటాను.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

