Manthani, Sub-Registrar | మంథని సబ్ రిజిష్టార్ పై నాన్ బెయిలబుల్ కింద నమోదు
Manthani, Sub-Registrar | పెద్దపల్లి, ఏప్రిల్ 23( నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా మంథని ఇంచార్జి సబ్ రిజిష్టార్ ముజిబర్ రెహ్మాన్ పై మంథని పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది.
Manthani, Sub-Registrar | పెద్దపల్లి, ఏప్రిల్ 23( నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా మంథని ఇంచార్జి సబ్ రిజిష్టార్ ముజిబర్ రెహ్మాన్ పై మంథని పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. స్థానికుల కథనం ప్రకారం.. మంథని మున్సిపల్ పరిధిలోని ఎరుకల గూడెం లోని ఎస్ఆర్ కె అపార్ట్మెంట్ ఏరియాలోని పడావు పడ్డ భూమి ఉంది. దానినిని ప్రభుత్వ భూమా లేక పట్టా భూమా అని నిర్దారణ చేయకుండానే, ఎటువంటి లింక్ దస్తావేజులు లేకుండానే, సర్వే నంబర్ పేర్కొనకుండా, రేకుల షెడ్ ఉన్న స్థలాన్ని ఖాళీ స్థలంగా పేర్కొన్నారు.
ప్రభుత్వ, మున్సిపల్ అదాయానికి గండి కొట్టి కొందరు పక్కనే ఉన్న తమ ఇంటి నంబర్ వేసి బహిరంగ మార్కెట్ లో దాదాపు రూ.50 లక్షల విలువ చేసే రెండు గుంటలకు పైగా ఉన్న విలువైన స్థలాన్ని రెండు గిప్ట్ డీడ్ ల పేరిట మంథని సబ్ రిజిష్టార్ రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారం పై ఈ కేసు నమోదైంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ లపై జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు పలు ఫిర్యాదులు వెళ్లగా మంథని మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతకుముందే పెద్దపల్లి కలెక్టర్ విచారణ జరిపించి మంథని సబ్ రిజిష్టార్ ముజిబర్ రెహ్మాన్ ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా ఉండడమే కాకుండా విధులలో మోసపూరితంగా, దురుద్దేశ్య పూర్వకంగా విధులు నిర్వహించినందుకు, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా రెవెన్యూ శాఖకు అట్టి భూమిపై వివరాలు కోరడం, ఆ తర్వాత అట్టి గిప్ట్ డీడ్ దస్తావేజుల రద్దుకు చలాన్, రద్దు దస్తావేజు తయారు చేయడంతో పాటు భాధ్యతయుతమైన ప్రభుత్వ అధికారి అయి ఉండి సమస్యలను సృష్టించినందుకు కేసు ఫైల్ చేయవలసిందిగా పెద్దపల్లి కలెక్టర్ మెమో ఇచ్చారు.
దీంతో స్పందించిన కమిషనర్ ఎన్ మనోహర్ మంథని సబ్ రిజిస్టారర్ పై కేసు నమోదు చేయాలని ఈనెల 16న లేఖ నంబర్ A1/06/2025 ప్రకారం మంథని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా గా అదేరోజు మంథని సబ్ రిజిష్టార్ ముజిబర్ రెహ్మాన్ పై భారతీయ న్యాయ సంహిత (BNS)316(2),318(4) నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద మంథని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటికీ రిజిస్టర్ మాత్రం ప్రతిరోజూ విధులకు హాజరు కావడం, పలు దస్తావేజులు కూడా రిజిస్ట్రేషన్ చేయడం విశేషం. ఇదిలా ఉండగా రిజిష్టార్పై కేసు నమోదు విషయం ఆలస్యంగా వెలుగు వచ్చింది.
సబ్ రిజిస్ట్రార్ ను అరెస్టు చేయాలి..
అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిన యవ్వారంలో ప్రభుత్వాన్ని మోసం చేసి,ప్రభుత్వ అదాయానికి గండి కొట్టి, తప్పుడు సమాచారంతో గిప్ట్ డీడ్ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన, చేసుకొన్న, బాధ్యులైన వ్యక్తులను కూడా కేసులో నిందితులుగా చేర్చాలని, కేసు నమోదు అయిన సదరు సబ్ రిజిష్టార్ను వెంటనే అరెస్ట్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఇనుముల సత్యనారాయణ డిమాండ్ చేశారు. అట్టి స్థలంలో మున్సిపల్, ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి, ఎవరికీ సంబంధం లేని అట్టి స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అయన డిమాండ్ చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

