Sircilla Collectorate | ఆహార పదార్థాల కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలి : పంతం రవి
పానీపూరి తిని అస్వస్థతకు గురైన బాధిత చిన్నారులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఐ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు.
సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 17 : పానీపూరి తిని అస్వస్థతకు గురైన బాధిత చిన్నారులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఐ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. స్థానిక సుభాష్‌నగర్‌లోని సీపీఐ కార్మిక భవన్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు వ్యాపారులు ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రత పాటించకుండా వీధుల్లో పానీపూరి, ఐస్‌క్రీమ్, చెరుకురసం విక్రయిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
ఇలాంటి ఆహార పదార్థాల విక్రయాలపై తనిఖీలు నిర్వహించి, నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు గుంటి వేణు, మీసం లక్ష్మణ్, సోమ నాగరాజు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

