Sircilla | పరిహారం పొందిన భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరిట ఎలా?.. ప్రజావాణిలో దేశాయిపల్లి గ్రామస్తుల ఫిర్యాదు
Sircilla | వరద కాలువ నిర్మాణంలో భాగంగా భూసేకరణ చేసి, పరిహారం చెల్లించిన భూమి తిరిగి ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామస్తులు ప్రశ్నించారు.
Sircilla | బోయినపల్లి రూరల్, అక్టోబర్ 26 వరద కాలువ నిర్మాణంలో భాగంగా భూసేకరణ చేసి, పరిహారం చెల్లించిన భూమి తిరిగి ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామస్తులు ప్రశ్నించారు. విలాసాగర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 1116/A2ఆ/1లో ఉన్న మూడు గుంటల భూమి వ్యవహారంపై సోమవారం బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరారు.
కాలువలో కలిసిన భూమికి మళ్లీ రిజిస్ట్రేషన్?
సదరు భూమి ఎఫ్ఎఫ్సీ కాలువ నిర్మాణంలో భాగంగా వరద కాలువలో కలిసిపోయిందని, అందుకు ప్రభుత్వం పరిహారం చెల్లించినట్లు రికార్డులు ఉన్నాయని గ్రామస్తులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పరిహారం ఏ ప్రాతిపదికన చెల్లించారు? భూమిని వ్యవసాయ భూమిగా పరిగణించారా? లేక ఇతర స్థలంగా లెక్కించారా? అనే వివరాలను వెల్లడించాలని కోరారు.
వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. అమీర్ రెడ్డి సురేందర్ రెడ్డి 2023 మే 22న ఇరిగేషన్ శాఖకు సంబంధించిన 20000508 నంబరుతో లావాదేవీ నిర్వహించారని, అనంతరం 2026లో తన భార్య అమీర్ రెడ్డి అనిత పేరిట సేల్ డీడ్ నంబర్ 533/2026తో రిజిస్ట్రేషన్ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ట్రాన్సాక్షన్ నంబర్ 2600593794 ద్వారా నాలా ఆర్డర్ కూడా పొందినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం పరిహారం చెల్లించిన భూమి తిరిగి ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ కావడానికి ఆధారాలేమిటని ప్రశ్నించారు. భూమి స్వభావం, భూసేకరణ వివరాలను పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్, నాలా ప్రక్రియ ఎలా పూర్తయ్యాయని నిలదీశారు.
ఆన్లైన్ దరఖాస్తు వస్తే సంతకం చేస్తారా?
తాను స్వయంగా భూమిని పరిశీలించలేదని, ఆన్లైన్లో దరఖాస్తు రావడంతో సంతకం చేశానని సంబంధిత అధికారి తెలిపినట్లు గ్రామస్తులు ఆరోపించారు. భూమి ప్రభుత్వ పరిధిలో ఉందా? కాలువ నిర్మాణంలో సేకరించారా? పరిహారం చెల్లించారా? అనే అంశాలను పరిశీలించకుండా ప్రక్రియ కొనసాగితే ప్రభుత్వ భూముల పరిరక్షణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
పరిహారం చెల్లింపు రికార్డులు, భూసేకరణ పత్రాలు, ఇరిగేషన్ శాఖ వివరాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, నాలా ఆర్డర్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. రెవెన్యూ, ఇరిగేషన్, రిజిస్ట్రేషన్ శాఖల సమన్వయంతో సమగ్ర విచారణ జరిపి, తప్పులు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఫిర్యాదు చేసిన వారిలో సర్పంచ్ నిమ్మ భాగ్యలత, శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ కుర్మా మనోహర్, వార్డు సభ్యులు అనిల్, మల్లేశం, గ్రామస్తులు కుర్మా శ్రీనివాస్, మానేరు లక్ష్మారెడ్డి, గంగయ్య తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

