Gollapalli | గొల్లపల్లిలో మార్కెట్ యార్డులో కొనుగోలు ప్రారంభించాలి.. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆందోళన
గొల్లపల్లి మార్కెట్ యార్డులో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని కోరుతూ గొల్లపల్లి మార్కెట్ యార్డ్ ముందు రైతులకు మద్దతుగా శుక్రవారం బీఆర్ఎస్ రాస్తారోకో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది.
Gollapalli | గొల్లపల్లి , నవంబర్ 27 : గొల్లపల్లి మార్కెట్ యార్డులో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని కోరుతూ గొల్లపల్లి మార్కెట్ యార్డ్ ముందు రైతులకు మద్దతుగా శుక్రవారం బీఆర్ఎస్ రాస్తారోకో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈనెల 11న కొబ్బరికాయ కొట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి 20 రోజులు గడిచినా ఒక క్వింటాల్ ధాన్యం తూకం వేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి ధాన్యం అమ్మకానికి వచ్చిన రైతులు మార్కెట్ యార్డులో నానా ఇబ్బందులు పడుతున్నారు.
మార్కెట్లో కొనేవారు లేక తేమలేని శుభ్రమైన ధాన్యాన్ని తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకుంటూ రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం తూకాలు ప్రారంభించకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ము కొన్ని నష్టపోతున్నారు. ఖరీఫ్ పంట ప్రారంభంలో రైతులు సన్న ధాన్యం రకాలు సాగు చేస్తే బోనస్ రూ.500 ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అనడంతో రైతులందరూ ప్రభుత్వం సూచించిన ధాన్యం రకాలను ఎంపిక చేసుకుని సాగు చేశారు. ప్రభుత్వం సూచించిన రకాలను సాగు చేసిన కొనేవారు లేక తమ గోడు పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Dharmapuri
- farmers
- gollapalli
RELATED ARTICLES
తాజా వార్తలు
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
Jagapathi Babu | పనివాళ్ళతో కలిసి భోజనం చేసిన జగపతిబాబు.. స్టార్డమ్ పక్కనపెట్టి మనసులు గెలుచుకుంటున్న విలన్!
Srinivas Goud | ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
RamNagar Fish Market | రామ్‌నగర్ చేపల మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 40 కిలోల కుళ్లిన చేపలు పట్టివేత!
Bhogi Review | ‘భోగి’ సినిమా రివ్యూ.. శర్వానంద్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

