Online betting | ఆన్లైన్ బెట్టింగ్.. అప్పుల ఊబిలోకి.. చివరకు చోరీ
ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ యువకుడు, అప్పులు తీర్చేందుకు సొంత అమ్మమ్మ మెడలోని బంగారు గొలుసును అపహరించాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
- నిందితుడి అరెస్ట్.. పది గ్రాముల బంగారు గొలుసు, బైకు, సెల్ ఫోన్ స్వాధీనం
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసులు
Online betting | బోయినపల్లి, నవంబర్ 27: ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ యువకుడు, అప్పులు తీర్చేందుకు సొంత అమ్మమ్మ మెడలోని బంగారు గొలుసును అపహరించాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి పది గ్రాముల బంగారు గొలుసు, బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. కోనరావుపేట మండలం పల్లె నిజామాబాద్‌కు చెందిన ముష్ణం వెంకటేష్ (29) హైదరాబాద్‌లో ఐటీఐ పూర్తి చేసి ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి తొలుత కొంత డబ్బు గెలిచినా, ఆ తర్వాత భారీగా నష్టపోయాడు. బెట్టింగ్ కోసం భార్య బంగారు నగలను తాకట్టు పెట్టడంతో పాటు, తెలిసిన వారి వద్ద అప్పులు చేసి మరీ ఆ డబ్బులను బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న డబ్బులను తిరిగి సంపాదించాలనే దురాశతో చోరీకి పథకం వేశాడు.
కోదురుపాక గ్రామంలో ఒంటరిగా ఉంటున్న తన అమ్మమ్మ బొంగొని రాజవ్వ మెడలో బంగారు గొలుసు ఉండటాన్ని గమనించి ఆమెను లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ నెల 18న పల్సర్ బైక్‌పై కోదురుపాకకు చేరుకొని, మంకీ క్యాప్ ధరించి ఇంట్లోకి ప్రవేశించాడు. గుర్తుపట్టకుండా లైట్ ఆర్పి, రాజవ్వ నోటికి తువ్వాలు అడ్డుపెట్టి బెదిరించి మెడలోని బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి కుమారుడు లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు బోయినపల్లి ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేశారు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టి సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కోదురుపాక ఎక్స్‌రోడ్డు వద్ద వెంకటేష్‌ను అదుపులోకి తీసుకొని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, అప్పుల బాధతో నేరాలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. యువత సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో బెట్టింగ్‌లకు ఆకర్షితులు కావద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రమాకాంత్‌తో పాటు సిబ్బంది ధర్మతేజ, కాశిం, శ్రీధర్, యాకూబ్‌లను డీఎస్పీ అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Retired Engineer | ఏపీ పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మిస్తుంటే తెలంగాణకు తెల్వక పోవడం ఆశ్చర్యకరం : రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆందోళన
Brothers Kill Wives | భార్యల మధ్య గొడవలు భరించలేక.. వారిని హత్య చేసిన సోదరులు
Mens Health | పురుషులు చక్కని శరీరాకృతి కావాలంటే ఈ సూచనలు పాటించాలి.. ఇవన్నీ కీలకమే..
Ramgopal Varma | ఏఐ ఉద్యోగాలను లాగేసుకుంటుందా.. ఆర్జీవీ సంచలన పోస్టు..!
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

