Ramagundam | రామగుండంలో అమ్మకానికి ఎన్వోసీ సర్టిఫికెట్లు..? ఒక్కోదానికి రూ.3వేల వసూలు
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ మరిచిపోయారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడటం, నామినేషన్ల స్వీకరణకు మూడు రోజులే గడువు విధించడం..పర్యవసానం రామగుండం బల్దియాలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉత్సుకతతో ఉన్న ఆశావహులు అపసోపాలు పడాల్సి వస్తోంది.
- ఎన్నికల వేల బల్దియాలో కానరాని ‘హెల్ప్ డెస్క్’
- అధికారుల తీరుతో ఆశావహుల గందరగోళం
- పంపు లేకున్నా.. నీటి బిల్లు కట్టాల్సిందేనట..!
- ఒక్కొక్కరూ రెండు ఎన్ఎసీలు తీసుకుంటున్న వైనం
- అదనపు కౌంటర్లు లేక అభ్యర్థుల ఆగచాట్లు
Ramagundam | కోల్ సిటీ, జనవరి 29: రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ మరిచిపోయారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడటం, నామినేషన్ల స్వీకరణకు మూడు రోజులే గడువు విధించడం..పర్యవసానం రామగుండం బల్దియాలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉత్సుకతతో ఉన్న ఆశావహులు అపసోపాలు పడాల్సి వస్తోంది. రెండు రోజులుగా నగర పాలక కార్యాలయం చుట్టూ ప్రదిక్షణలు చేస్తుండటం ఇక్కడే జాతరను తలపిస్తోంది.
ఎన్నికల నియమావళి, నిబంధనలపై స్పష్టత ఇవ్వడానికి కార్యాలయంలో హెల్ప్ డెస్క్ లేకపోవడంతో ఆశావహులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇదిలా ఉంటే గురువారం సైతం ఎన్ ఓ సీ సర్టిఫికెట్ కోసం రూ.3వేలు వసూలు చేస్తుండటంతో పలువురి నుంచి ఆక్షేపణలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలో మరెక్కడ లేని నిబంధన ఒక్క రామగుండంలోనే ఎందుకంటూ పలువురి నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలకు మున్సిపాలిటీ నుంచి ఏలాంటి బకాయిలు లేవన్న డిక్లరేషన్ పత్రం జత చేయాల్సి ఉంటుంది. ఇదిప్పుడు బల్దియాకు కలిసివచ్చింది. రెండు రోజుల్లోనే రూ.లక్షల ఆదాయం సమకూర్చింది. కొంతమంది పోటీ అభ్యర్థులు రెండు సెట్లు నామినేషన్ వేయాల్సి ఉంటే రెండు ఎన్ఓ సీ సర్టిఫికెట్లు తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.
ఈ లెక్కన రూ.6వేలు చెల్లించి తీసుకోవడం కనిపించింది. ఇంకొందరు నీటి కనెక్షన్ లేకున్నా నల్లా బిల్లు కట్టాలని చెప్పడంతో గత్యంతరం లేక చెల్లించే పరిస్థితి మరింత ఆశ్చర్యం కలిగించింది. సింగరేణి, ఎన్టీపీసీ క్వార్టర్లలో నివసించే వారు పోటీ చేయాలనుకుంటే మున్సిపాలిటీ నుంచి పన్నుల బకాయిలు లేవని డిక్లరేషన్ కోసం రూ.3వేలు చెల్లించి ఎన్ఓ సీ తీసుకుంటున్నారు. ఐతే కార్యాలయంలో అదనపు కౌంటర్లు లేకపోవడం, ఇన్వార్డ్ సెక్షన్లో ఉన్న సిబ్బందితోనే ఎన్ఓ సీ, ఇంటి, నల్లా పన్నులు తీసుకోవడం సిబ్బంది కొరతతో అభ్యర్థులు గంటల పాటు ఆగచాట్లు పడటం కనిపించింది.
డివిజన్లో ఓటు హక్కు ఉండి అద్దె ఇంట్లో నివాసం ఉంటూ పోటీ చేయాలనుకునే ఆశావహులు కార్యాలయంకు రాగా క్లియరెన్స్ కోసం స్పష్టత ఇవ్వడంలో అధికారులు చేతులెత్తేశారు. మొత్తంగా హెల్ప్ డెస్క్ అనేది లేకపోవడంతో అయోమయంకు గురయ్యారు. బిల్లులు చెల్లించేందుకు వచ్చిన ఆశావహులకు ఖచ్చితమైన సమాచారం లభించకపోవడంతో అధికారుల వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం చివరి రోజు కావడంతో ఆశావహులతో నగర పాలక కార్యాలయం రోజంతా కిక్కిరిసిపోయింది. అదనపు కౌంటర్లు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

