Serf employees | బదిలీకి నై… ఉన్న చోటుకే సై.. ట్రాన్స్ఫర్ నుంచి మినహాయింపునకు సెర్ఫ్ ఉద్యోగుల పైరవీలు
సెర్ఫ్ ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖలో చేపడుతున్న బదిలీల్లో అప్పుడే పైరవీల పర్వం మొదలైంది. ఏళ్లకేళ్లుగా పాతుకుపోయిన కొంతమంది ఉద్యోగులు, జిల్లా కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తున్నది.
- ప్రస్తుతమున్న స్ధానానికే మొదటి ప్రాధాన్యత
- స్థానచలనం తప్పదనుకున్నవారు అధికార ప్రజాప్రతినిధులతో ఒత్తిడి
Serf employees | కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 15 : సెర్ఫ్ ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖలో చేపడుతున్న బదిలీల్లో అప్పుడే పైరవీల పర్వం మొదలైంది. ఏళ్లకేళ్లుగా పాతుకుపోయిన కొంతమంది ఉద్యోగులు, జిల్లా కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తున్నది. దీర్ఘకాలంగా జిల్లాలో కొనసాగుతున్నవారంతా విధిగా పక్కజిల్లాల ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉన్నా, ప్రస్తుతం కొనసాగుతున్న జిల్లానే మొదటి ప్రాధాన్యతలో ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
తమను యధాస్థానంలో కొనసాగించేలా రాజకీయ ఒత్తిళ్లకు కూడా దిగుతున్నట్లు డి ఆర్ డి ఏ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నది. వివిధ రకాల కారణాలతో గత కొన్నేల్లుగా సెర్ఫ్ లో బదిలీలు జరగకపోగా, వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న పలు కేటగిరీలకు చెందిన ఉద్యోగులు ఆయా విభాగాల్లో గట్టి పట్టు సంపాదించినట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వాటిలో జరిగే లోటుపాట్లు కూడా వారికి క్షుణ్ణంగా తెలియటంతో ఏకచత్రాధిపత్యం చెలాయిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అత్యధిక మంది ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్న చోట, ఉద్యోగానికి సమాంతరంగా పలు వ్యాపారాలు కూడా మొదలుపెట్టి నాలుగు చేతుల సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత స్థానాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ అయితే ఆదాయ అర్జనకు భారీగా గండి పడుతుంది. క్షేత్రస్థాయి సందర్శనలు లేకుండానే ఉన్నచోట నుంచే విధులు నిర్వహించే అవకాశానికి కూడా దూరం అవుతారు.
ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లి ఆదాయ మార్గాలు దూరం చేసుకుని శారీరక శ్రమను కొన్ని తెచ్చుకునే బదులు, ఎలాగోలా అధికారులను ఒప్పించి యధా స్థానాల్లో కొనసాగేందుకు ఉమ్మడి జిల్లాలోని పలువురు సెర్ఫ్ ఉద్యోగులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖలో వివిధ కేడర్లలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు బదిలీలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఎల్ 5 కేటగిరి కింద అదనపు డిఆర్డిఓల బదిలీలు పూర్తి చేయగా, ఎల్ ఫోర్ కేటగిరీ కిందికి వచ్చే డిపిఎంలకు కూడా నేడో రేపో బదిలీ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. అలాగే ఎల్ వన్, ఎల్ టు, ఎల్ త్రీ కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు కూడా బదిలీలు చేపట్టేందుకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం కల్పించారు.
ఉమ్మడి జిల్లాలో ఎల్ 5నుంచి ఎల్ 1 వరకు 700 పై చిలుకు ఉద్యోగులు ఉండగా, ఎల్ 5 కేటగిరీ అధికారులకు కౌన్సెలింగ్ పూర్తయి, బదిలీ ఉత్తర్వులు కూడా విడుదల చేశారు. అనంతరం ఎల్ 4 కేటగిరీ పరిధిలోకి వచ్చే డిపిఎం లకు ఒకటిరెండ్రోజుల్లో కౌన్సెలింగ్ జరుగనున్నది. స్థానాచలనానికి సుముఖంగా లేని పలువురు డిపిఎం లు అమాత్యుల వద్దకు పరుగులు తీస్తున్నట్లు తెలుస్తున్నది. కుంటిసాకులు చెబుతూ తమను ఉన్న స్థానాల్లోనే కొనసాగించేలా ఆదేశించాలని వేడుకుంటున్నట్లు, మరి కొంత మంది సిఫారసు లేఖలతో సెర్ఫ్ సీఈఓ ను ముందే కలుస్తున్నట్లు వినికిడి. గ్రామీణ ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా విధులు నిర్వహించాల్సిన గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల బదిలీల్లో పైరవీలకు తావు కల్పిస్తే, ఆ సంస్థ లక్ష్యం నీరు గారి పోయే అవకాశాలు న్న దృష్ట్యా పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని గ్రామీణ అభివృద్ధి శాఖ ఉద్యోగులు కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

