జమ్మికుంట, అక్టోబర్ 6: ఆడబిడ్డలకు పండుగ కానుకగా బతుకమ్మ చీరెలను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో కౌన్సిలర్లు దేశిని రాధ-సదానందం, ఎలగందుల స్వరూప-శ్రీహరితో కలిసి వైస్ చైర్పర్సన్ మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు. బతుకమ్మ పండుగకు సారె పెడుతున్న సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టు చీరలను మైమరించే డిజైన్లలో వచ్చాయని, సద్దుల బతుకమ్మ రోజున ఇవే చీరెలతో ఆడుకుంటామని తెలిపారు. ఇక్కడ ఆర్పీ సృజన, ఎండీ భాను, వార్డ్ ఆఫీసర్ మధుసూదన్, డీలర్ వెంకటేశ్వర్లు, మహిళలు పాల్గొన్నారు.
బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రతి ఆడపడుచుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ సారెను అందిస్తున్నారని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో బతుకమ్మ చీరెలను పంపిణీ చేసి మాట్లాడారు. కౌన్సిలర్లు శ్రీపతి నరేశ్‌గౌడ్, పొనగంటి సారంగం, బిట్ల కళావతి-మోహన్, పిట్టల శ్వేత-రమేశ్, డీలర్ వెంకటేశ్వర్లు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
వీణవంక, అక్టోబర్ 6: తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్దన్నలా అందిస్తున్న పండుగ కానుక బతుకమ్మ చీరెల పంపిణీ ఊరూరా పండుగలా జరుగుతుందని వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, సర్పంచ్ మ్యాకల సమ్మిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని రామకృష్ణాపూర్, బేతిగల్, లస్మక్కపల్లి, గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేసి మాట్లాడారు. సర్పంచులు మోరె సారయ్య, దాసారపు సుజాత-లక్ష్మణ్, బేతిగల్ గ్రామ కో ఆప్షన్ మెంబర్ గొట్టుముక్కల రవీందర్రావు, తన్నీరు హరీశ్ టీం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అప్పని హరీశ్వర్మ, రామకృష్ణాపూర్ ఉపసర్పంచ్ దూడపాక రాజకొమురయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఇల్లందకుంట అక్టోబర్ 6: ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ కానుకగా బతుకమ్మ చీరెలను అందిస్తున్నట్లు ఎంపీపీ పావని- వెంకటేశ్ పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేపట్టారు. మండలానికి 10,765 బతుకమ్మ చీరెలు వచ్చాయని, రెండు రోజుల్లో అన్ని రేషన్ షాపుల వద్ద మహిళలకు చీరెలను పంపిణీ చేస్తామని చెప్పారు. సర్పంచులు రాజిరెడ్డి, రాజు, వెంకటస్వామి, దిలీప్‌రెడ్డి, శ్రీలత-సురేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, మట్ట రజిత-వాసుదేవరెడ్డి, మానస- మహేందర్, మనమాల వాసు, మొగిలి, అరుణ-సదానందం, సరోజన- నాగయ్య, లలిత, మల్లయ్య, ఎంపీటీసీలు ఎక్కటి సంజీవరెడ్డి, విజయకుమార్, ఓదెలు, ఐలయ్య, చిన్నరాయుడు, రమ, ఉప సర్పంచ్ తిరుపతి, తహసీల్దార్ రాణి, ఎంపీడీవో శంకర్, ఎంపీవో వెంకటేశ్వర్లు, ఏపీఎం రమాదేవి, సీసీ జనార్దన్, పంచాయతీ కార్యదర్శులు, రేషన్‌డీలర్లు ఉన్నారు.
సైదాపూర్, అక్టోబర్ 6: సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు, వెన్కేపల్లి సర్పంచ్ కొండ గణేశ్ అన్నారు. వెన్కేపల్లిలో మహిళలకు ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలను పంపిణీచేసి మాట్లాడారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్త మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి తిరుమల, వార్డుసభ్యులు దుంపేటి ఆంజనేయులు, డీలర్ మ్యాకల రాజు, వీవోలు రేణుశ్రీ, కనకలక్ష్మి, రజిత ఉన్నారు. అలాగే లక్ష్మణ్ణపల్లిలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి చీరెలు పంపిణీ చేశారు. సర్పంచ్ రాములు పాల్గొన్నారు.
హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 6: కాట్రపల్లి గ్రామంలో సర్పంచ్ కాసగోని నిరోష బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. గ్రామంలో ప్రతి మహిళకు బతుకమ్మ చీర అందుతుందన్నారు.
హుజూరాబాద్‌టౌన్ అక్టోబర్ 6: రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉండాలని, ప్రతీ ఏడాది దసరా కానుకగా అందించే బతుకమ్మ చీరెలను కులమతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ అందిస్తున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లుతో కలసి మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేసి మాట్లాడారు. మహిళలు రేషన్‌కార్డు తీసుకొని వెళ్లి బతుకమ్మ చీరెను తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) రిసోర్స్ పర్సన్లు, ప్రత్యేకాధికారులు, రేషన్ డీలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
చిగురుమామిడి, అక్టోబర్ 6: మహిళల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మహిళలకు బతుకమ్మ చీరెలను అధికారులతో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గానికి గోదావరి జలాలు అందించి సస్యశ్యామలం చేశారన్నారు. మండలంలో 11,670 బతుకమ్మ చీరెలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, తహసీల్దార్ ఇప్ప నరేందర్, ఎంపీడీవో నర్సయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు సాంబారి కొమురయ్య, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పెనుకుల తిరుపతి, సర్పంచులు బెజ్జంకి లక్ష్మణ్, సన్నీల్ల వెంకటేశం, బోయిని శ్రీనివాస్, ముప్పిడి వెంకట నర్సింహారెడ్డి, మండల పరిషత్ సూపరింటెండెంట్ ఖాజా మోహినుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ స్వరూపారాణి, ఆర్ఐ శైలజ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, నాయకులు బెజ్జంకి రాంబాబు, నాగెల్లి రాజిరెడ్డి, ముసు కిష్టారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, డీలర్లు ఉన్నారు.
గన్నేరువరం రూరల్, అక్టోబర్ 6: మండలంలో ప్రజాప్రతినిధులు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఇక్కడ నాయకులు, రేషన్ డీలర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
శంకరపట్నం, అక్టోబర్ 6: మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో శుక్రవారం బతుకమ్మ చీరలు, స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఇటీవల రాష్ట్ర సాంస్కతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ వంకాయగూడెం మాధవసాయి గార్డెన్లో స్పోర్ట్స్ కిట్లను ఆయా గ్రామాల సర్పంచులు, యువకులకు అందజేవారు. శుక్రవారం ఇప్పలపల్లి సర్పంచ్ బైరి సంపత్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను, యువజన సంఘాలకు స్పోర్ట్స్ కిట్లనుపంపిణీ చేశారు. ఉప సర్పంచ్ వెంగళ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి దివ్యాంజలి, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ మండల శాఖ ఉపాధ్యక్షుడు చింతిరెడ్డి రమణారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు చింత సంపత్, కామెర కిషన్, తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్, అక్టోబర్ 6: మండల వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు శుక్రవారం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. రామకృష్ణ కాలనీ సర్పంచ్ మీసాల అంజయ్య, ఉపసర్పంచ్ గుజ్జుల ప్రణీత్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.