MLA Vijayaramana Rao | కరాటే విద్యార్థినికి ఎమ్మెల్యే విజయరమణారావు అభినందన
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రుషిగాని వినూత్న నేపాల్ రాజధాని ఖాట్మండులో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో అండర్-12 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది.
MLA Vijayaramana Rao | కాల్వశ్రీరాంపూర్, జూన్ 9 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రుషిగాని వినూత్న నేపాల్ రాజధాని ఖాట్మండులో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో అండర్-12 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. అంతర్జాతీయ వేదికపై రాణించి దేశానికి, పెద్దపల్లి నియోజకవర్గానికి పేరు తెచ్చిన కరాటే విద్యార్థిని వినూత్నను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మంగళవారం కాల్వశ్రీరాంపూర్ లో ప్రత్యేకంగా అభినందించారు.
వినూత్నను శాలువాతో సన్మానించి, భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. చిన్న వయసులోనే ఇంతటి ప్రతిభ కనబరిచిన వినూత్న, ఆమె తల్లిదండ్రులను మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు.
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 66 మంది లబ్ధిదారులకు రూ.66,07,656ల విలువ గల కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్, పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాముడు, ఎంపీడీవో దివ్య సుదర్శన్ రావు, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

