తెలంగాణచౌక్, ఫిబ్రవరి 4: నగరంలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన టేబుల్ క్యాలెండర్ను ఆదివారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కోడూరి పరశురాంగౌడ్, జిల్లా వరింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ సంతోషి, తదితరులు పాల్గొన్నారు.