గంగాధర, ఫిబ్రవరి 25: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి ప్రభాకర్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కురిక్యాల సొసైటీలో నిధులు దుర్వినియోగం, విధుల పట్ల కార్యదర్శి నిర్లక్ష్యం వహిస్తున్నాడంటూ కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో విచారణ తర్వాత అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. సస్పెండ్‌కు గురైన ప్రభాకర్ స్థానంలో రామడుగు సింగిల్ విండో కార్యదర్శికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.