Kalvakuntla Vidyasagar | కేసీఆర్ దీక్ష..భారత రాజకీయాల్లో కీలక మలుపు : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్
Kalvakuntla Vidyasagar | కేసీఆర్ చేపట్టిన దీక్ష భారత రాజకీయాల్లో కీలక మలుపని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు.
జగిత్యాల : కేసీఆర్ ( KCR ) చేపట్టిన దీక్ష భారత రాజకీయాల్లో కీలక మలుపని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ( Kalvakuntla Vidyasagar ) అన్నారు. 16వ దీక్షా దివస్( Deeksha Diwas) సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలోనే కాదు, భారత రాజకీయాల్లో ఒక మహత్తర ఘట్టమని పేర్కొన్నారు. ఈ దీక్ష ప్రజల్లో పెరిగిన తెలంగాణ ఆత్మగౌరవ జ్వాలను మరింతగా రగిలించి, సమూహ స్ఫూర్తిని పెంచి, చివరికి తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేసిందని గుర్తుచేశారు.
తెలంగాణ ఉద్యమం కోసం తన ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరవలేనివని, వారి ఆశయాలను నెరవేర్చడం కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ప్రజలతో పాటే ఉండి పనిచేస్తుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ముందుండి పోరాటం చేస్తుందని తెలిపారు.
2009 నవంబర్ 29 లో కరీంనగర్ నుంచి సిద్దిపేట దీక్ష శిబిరానికి వెళ్తున్న కేసీఆర్ను కరీంనగర్లో అరెస్ట్ చేసిన కూడా జైలులో దీక్ష చేపట్టడడంతో కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీ రామ రక్షా అని, ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మళ్లీ వచ్చేది బీఆర్ఎస్దేనని ధీమాను వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి, ధర్మపురి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సంగి సత్తమ్మ, మాజీ కౌన్సిలర్లు దేవేందర్ నాయక్, అవారి శివాకేసారి బాబు, దారిశెట్టి రాజేష్, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

