Sircilla | తెలంగాణ జాతి పిత కేసీఆర్.. బీఆర్ఎస్ రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
ఆమరణ దీక్ష చేపట్టి తెలంగాణ సాధించిన, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. దీక్షా దివస్ పూర్తి సభకు జిల్లా నుంచి దండుగా బయలుదేరుతున్నామని, 30 వేల మందితో సభకు పయనం అవుతున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు.
- అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన నాయకులు
- రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అలుగునూరు దీక్ష స్ఫూర్తి సభకు దండుగా వెళ్తున్నామని వెల్లడి

Sircilla | రాజన్న సిరిసిల్ల నవంబర్ 29( నమస్తే తెలంగాణ) : ఆమరణ దీక్ష చేపట్టి తెలంగాణ సాధించిన, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. దీక్షా దివస్ పూర్తి సభకు జిల్లా నుంచి దండుగా బయలుదేరుతున్నామని, 30 వేల మందితో సభకు పయనం అవుతున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. దీక్షా దివాస్ పురస్కరించుకొని కొత్త బస్టాండ్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేశారు. కేసీఆర్ ఫ్లెక్సీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. జై తెలంగాణ ..జై కేసీఆర్..జై జై కెటిఆర్ అంటూ నినాదాలు చేశారు. పాత బస్టాండ్ లో నేతన్న చౌరస్తా లో నేతన్న విగ్రహానికి పూల మాలలు వేశారు. తర్వాత అమర వీరుల స్థూపానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళతో కలిసి పూలు మాలలు వేసి, నివాళులర్పించారు.
అనంతరం మీడియాతో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడారు. దీక్షా దివాస్ పురస్కరించుకొని తెలంగాణ ప్రదాత, తెలంగాణ సాధించిన తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం నిర్వహించామన్నారుతెలంగాణ తల్లి విగ్రహానికి , పాత బస్టాండ్‌లో నూతన విగ్రహానికి పూల మాలలు వేశామని పేర్కొన్నారు. అనంతరం అమరవీరుల స్థూపానికి పూల నివాళులర్పించి, త్యాగాలను స్పందించుకున్నామన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష స్ఫూర్తి సభ భారీగా తరలి వెళ్తున్నామని పేర్కొన్నారు. 25 వేల నుంచి 30 వేల వరకు జిల్లా నుంచి సభకు దండుగా వెళ్తున్నామన్నారు. కెసిఆర్ దీక్ష స్ఫూర్తి త్యాగం పోరాట పాడిన తెలంగాణ సాధన నేటి తరానికి తెలియజేయాలని దీక్షా స్ఫూర్తి సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరుకానున్నారని వెల్లడించారు. దీక్షా దివాస్ కు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని మరోసారి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు, మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
“కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

