బరిలో నిలిచి.. పతకం గెలిచి..
శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో ఇటీవల సింగరేణి స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. సింగరేణి యాజమాన్యం పవర్ లిఫ్టింగ్ పోటీలు మహిళా ఉద్యోగులకు మొదటి సారిగా నిర్వహించింది. ఇప్పుడు సింగరేణిలో కారుణ్య ఉద్యోగాల ద్వారా సంస్థ వ్యాప్తంగా పాతవారు
- సింగరేణీ స్థాయి క్రీడా పోటీల్లో పలువురి సత్తా
- కోలిండియాకు ఎంపిక
- అక్కడా ప్రతిభ చూపుతామని ధీమా
శ్రీరాంపూర్, జనవరి 1 : శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో ఇటీవల సింగరేణి స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. సింగరేణి యాజమాన్యం పవర్ లిఫ్టింగ్ పోటీలు మహిళా ఉద్యోగులకు మొదటి సారిగా నిర్వహించింది. ఇప్పుడు సింగరేణిలో కారుణ్య ఉద్యోగాల ద్వారా సంస్థ వ్యాప్తంగా పాతవారు, కొత్త ఉద్యోగులు కలిపి 1500 మంది ఉండడం, అందులో యువతులు అధికంగా ఉండడం విశేషం. ఇక్కడ సత్తా చాటిన క్రీడాకారులు కోలిండియా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పోటీల్లో రాణించడం సంతోషంగా ఉందని క్రీడాకారులు తమ మనోగతాన్ని వెల్లడించారు.
ఆరోసారి పాల్గొనబోతున్నా..
సింగరేణి సంస్థ నుంచి బాడీ బిల్డింగ్ పోటీల్లో గోల్డ్‌మెడల్ సాధించి 6వ సారి కోలిండియా స్థాయిలో పాల్గొనబోతున్నా. 60 కిలోల విభాగంలో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటున్నాను. శ్రీరాంపూర్ ఆర్కే 5లో టెండాల్గా పని చేస్తున్నా. ఇప్పటి వరకు కోలిండియా స్థాయి పోటీల్లో 2 సార్లు గోల్డ్ మెడల్ సాధించాను. సింగరేణి యాజమాన్యం సంస్థ ఉద్యోగులు, కార్మికులను ప్రోత్సహిస్తున్నది. శ్రీరాంపూర్‌లో అన్ని విధాలా సౌకర్యాలు కల్పించారు.
– పులి కిష్టయ్య. ఆర్కే5 శ్రీరాంపూర్
కోలిండియాకు ఎంపికయ్యా..
కోలిండియా స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి సంస్థకు పేరు తెస్తాం. 19 సార్లు కోలిండియా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్నాను. 13 సార్లు గోల్డ్ మెడల్ సాధించాను. 3 సార్లు సిల్వర్ మెడల్ సాధించాను. 96 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి కోలిండియాకు ఎంపికయ్యాను. మహారాష్ట్ర సింగరోలిలో జరిగే కోలిండియా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధిస్తాననే నమ్మకం ఉంది. ప్రస్తుతం ఈపీ ఆపరేటర్‌గా జీడీకే 5 ఓసీపీలో పని చేస్తున్నా.
– ఆవుల సత్తయ్య, జీడీకే 5
బాడీ బిల్డింగ్ పోటీల్లో పతకం ఖాయం
సింగరేణి స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో 55 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి కోలిండియా పోటీలకు ఎంపికయ్యాను. కోల్‌కతాలో జరిగే కోలిండియా బాడీ బిల్డింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధిస్తాననే నమ్మకం ఉంది. మొదటి సారిగా కోలిండియా స్థాయి పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ కల్పించిన కారుణ్య ఉద్యోగంతో సంస్థలో చేరా. ఆర్జీ -3 అడ్రియాల ప్రాజె క్టులో ట్రామర్‌గా పని చేస్తున్నా. కోలిండియా పోటీల్లో రాణిస్తాననే నమ్మకం ఉంది.
– పర్స సాగర్, ఆర్జీ-3
మొదటిసారి పవర్ లిఫ్టింగ్ పోటీలు
యాజమాన్యం మహిళా ఉద్యోగులకు మొదటి సారిగా పవర్ లిఫ్టింగ్ పోటీలు ని ర్వహించడం సంతోషంగా ఉంది. ప్ర స్తుతం నేను శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్‌లో జనర ల్ మజ్దూర్‌గా పని చేస్తున్నా. ఆటలంటే ఇష్టం. 40 కిలోల విభాగం పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మొదటి స్థానం సాధించా. కోలిండియా పోటీలకు ఎం పికవడం సంతోషంగా ఉంది.
– తౌటం నవ్య, శ్రీరాంపూర్
పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది
శ్రీరాంపూర్‌లో జరిగిన సింగరే ణి స్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో 66 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించా. కోలిండియా స్థాయి పోటీలకు ఎం పికవడం సంతోషంగా ఉంది. అక్కడ కూడా బంగారు ప తకం సాధించడమే లక్ష్యం. భూపాలపల్లి ఏరియా దవా ఖానలో జూనియర్ స్టాఫ్ నర్స్‌గా పని చేస్తున్నా. మాది మహబూబాబాద్ జిల్లా తట్టుపల్లి గ్రామం. – పోతుగంటి శ్వేత, భూపాలపల్లి
గోల్డ్ మెడల్ వచ్చింది..
కోలిండియా స్థాయి పవర్ లి ఫ్టింగ్ పోటీల్లో ఇప్పటి వరకు 8 సార్లు పాల్గొన్నా. ఈసారి సింగరే ణి స్థాయి పోటీల్లో 83 కిలోల విభా గంలో గోల్డ్ మెడల్ సాధించా. ప్రస్తుతం కొ త్తగూడెం ఏరియాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నా. ఇప్పటి వరకు కోలిండియా స్థాయి పోటీల్లో 8 బంగారు పతకాలు సాధించా. ఈ సారి కూడా సాధిస్తాననే నమ్మకం ఉంది.
– పోగుల స్వామి, కొత్తగూడెం
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

