Appointed | మల్లాపూర్, ఆగస్టు 10 : ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా మండలంలోని సంగెం-శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన ఎల్క కమలాకర్ ఏకగ్రీవంగా నియమితులాయ్యారు. ఈ మేరకు ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మగ్గిడి వెంకటనర్సయ్య సోమవారం నియామక ఉత్తర్వులను జారీ చేశారు.
ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సంఘం బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని, తన ఎన్నికకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాల్క మోహన్, కార్యదర్శి నేరేళ్ల శ్రీధర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పెంటపర్తి అశోక్, డివిజన్ అధ్యక్షుడు శోభన్, నాయకులు తుక్కరాం, తదితరులు పాల్గొన్నారు.