Karimnagar | కమాన్ చౌరస్తా, జులై 8 : ప్రతిష్టాత్మక టీసీఎస్ (TCS)–2026 నియామకాల్లో ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ & పీజీ కళాశాల, కరీంనగర్ కు చెందిన 11 మంది విద్యార్థినులు ఉద్యోగాలకు ఎంపికై మరోసారి కళాశాల ప్రతిష్టను చాటారు. ఎంపికైన విద్యార్థినుల ఫలితాలను ఈ-మెయిల్ ద్వారా విడుదల చేశారు. ఈ నియామక ప్రక్రియను తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి నెలలో నిర్వహించారు. కాగా తుది ఇంటర్వ్యూలు జూన్ 19న హైదరాబాద్‌లో చేపట్టారు. కఠినమైన ఎంపిక ప్రక్రియలో ఆల్ఫోర్స్ విద్యార్థినులు ప్రతిభ కనబరిచి టీసీఎస్‌లో ఉద్యోగ అవకాశాలను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ వీ రవీందర్ రెడ్డి ఎంపికైన విద్యార్థినులను అభినందించి సన్మానించారు. అలాగే వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందం, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించడం వల్లే ఇలాంటి విజయాలు సాధ్యమవుతున్నాయి. విద్యార్థినుల కృషి, తల్లిదండ్రుల సహకారం, అధ్యాపకుల అంకితభావం కలిసి ఈ విజయాన్ని అందించాయి.
భవిష్యత్‌లో మరింత మంది విద్యార్థినులు దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించేలా ఆల్ఫోర్స్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి TASK ప్రాంతీయ సమన్వయకర్త గంగాప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ఎంపికైన విద్యార్థినులను అభినందించారు. ఉపాధి అవకాశాల కల్పనలో ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ & పీజీ కళాశాల విశేష కృషి చేస్తోందని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్, అధ్యాపక బృందం, ఎంపికైన విద్యార్థినులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.