ఈతకు నేర్చుకునేందుకు వెళ్లి..
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన ఇంటర్ విద్యార్థి అనుకోని రీతిలో మృత్యుఒడికి చేరాడు. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చాడు. పోలీసుల వివరాల ప్రకారం.. జీలకుంటకు చెందిన దొడ్డిపెల్లి కుమారస్వామి- రేణుక దంపతులకు ఇద్దరు కొడుకులు.
- బావిలో మునిగి ఇంటర్ విద్యార్థి మృత్యువాత
- ఇంటికి వచ్చే క్రమంలో ప్రమాదవశాత్తూ నీటిలో పడి మృతి
- జీలకుంటలో విషాదం
ఓదెల, మే 15: ఈత నేర్చుకోవడానికి వెళ్లిన ఇంటర్ విద్యార్థి అనుకోని రీతిలో మృత్యుఒడికి చేరాడు. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చాడు. పోలీసుల వివరాల ప్రకారం.. జీలకుంటకు చెందిన దొడ్డిపెల్లి కుమారస్వామి- రేణుక దంపతులకు ఇద్దరు కొడుకులు. అందులో పెద్దోడు అరవింద్ (19) ఓదెల మోడల్ స్కూల్లో ఇటీవలే ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పూర్తి చేశాడు.
ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఈత నేర్చుకోవాలనుకున్నాడు. బుధవారం స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. నడుముకు ఖాళీ ప్లాస్టిక్ ఆయిల్ క్యాన్లు కట్టుకుని కొద్దిసేపు బావిలో ఈత నేర్చుకునే ప్రయత్నం చేశాడు. ఇంటికి వెళ్లే క్రమంలో అందరితోపాటు అరవింద్ కూడా బావి పైకి వచ్చాడు. కాలికి బురద అంటడంతో బండరాయి మీద నిల్చొని కడుక్కుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడ్డాడు.
గమనించిన స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. నీటిలో మునిగి చనిపోయాడు. కుటుంబసభ్యులు, గ్రామస్తులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. బావిలో నుంచి అరవింద్ మృతదేహాన్ని బయటికి తీయడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా గొల్లుమన్నారు. మృతదేహంపై పడి గుండలవిసేలా రోదించారు. పొత్కపల్లి ఎస్ఐ అశోక్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. తండ్రి కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

