Godavarikhani | అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలి.. సీపీఐ నాయకుల డిమాండ్
అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్లను వెంటనే పూర్తి చేయాలని, లేదంటే రామగుండం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును, టోల్ గేటును ముట్టడిస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.
- ఆ పార్టీ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నిరసన ప్రదర్శన
- ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, టోల్ గేటును ముట్టడిస్తామని హెచ్చరిక
Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 28 : అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్లను వెంటనే పూర్తి చేయాలని, లేదంటే రామగుండం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును, టోల్ గేటును ముట్టడిస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలోని సర్వీస్ రోడ్డును శనివారం పరిశీలించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, గోశిక మోహన్, సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య మాట్లాడారు. హెచ్కేఆర్ఎల్ కంపెనీ టోల్ వసూలు చేస్తూ హైవే రోడ్డను మాత్రం గాలికి వదిలేసిందని ఆరోపించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి రోడ్డున నిర్మించి సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తైన తర్వాత టోల్ వసూలు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ నిబంధనలకు తిలోధకాలు ఇచ్చి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి సర్వీస్ రోడ్లను నిర్మాణం చేయడంలో విఫలమయ్యారన్నారు. తాను అధికారంలోకి రాగానే సర్వీస్ రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తానని ఎన్నికల వాగ్దానంగా చెప్పిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గెలిచి మూడేళ్లు అయినా ఇప్పటివరకు సర్వీస్ రోడ్డును నిర్మించకపోవడం తన అసమర్ధతకు నిదర్శనమని అన్నారు.
రామగుండం నుండి బస్టాండ్ వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి నిర్మాణాలను వెంటనే తొలగించి సర్వీసు రోడ్డు నిర్మిస్తామని నమ్మబలికి దాదాపు మూడుసార్లు ప్రారంభిస్తున్నట్టుగా కొబ్బరికాయలు కొట్టిన ఎమ్మెల్యే ఇప్పటికి కూడా సర్వీస్ రోడ్ నిర్మాణం చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. సర్వీస్ రోడ్ల పేరుతో టోల్‌గేట్‌ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకుంటున్న ఎమ్మెల్యే ప్రజల బాగోగులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. రామగుండం ప్రాంతాన్ని రూ.1200 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్న అనే ప్రగల్బాలు పలుకుతున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఒక్కసారి మున్సిపల్ చౌరస్తా దగ్గర దిగి జీఎం కాలనీ చౌరస్తా వరకు నడిచి రోడ్డును పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఈ రోడ్డపై వెళ్లే ప్రజలకు ఇబ్బందులవుతున్నాయో తెలుస్తాయని చెప్పారు.
ఇప్పటికైనా రామగుండం ఎమ్మెల్యే తన చిత్తశుద్ధిని చాటుకోవాలని వెంటనే సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, లేకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు టోల్గేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు మడికొండ ఓదమ్మ, ఆసాల రమా శనిగరపు చంద్రశేఖర్, సిరిసిల్ల మల్లేష్, రేణిగుంట్ల ప్రీతం, కౌన్సిల్ సభ్యులు గంగారపు చంద్రయ్య, ఎజ్జ రాజయ్య, తిరుమల, అబ్దుల్ కరీం, సుధీర్ కుమార్, కలువల జగన్, రేణుక, పోతరాజు నాగరాజు, అనూప్ సాయి, కుమారస్వామి, నరేష్, కమలాస్ తదితరులు పాల్గొన్నారు
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దీపం వెలిగించి వెళ్లిన కొద్దిసేపటికే అగ్నికి ఆహుతైన ఇల్లు
Health tips | ఆ ఆరోగ్య సమస్యలకు పుదీనాతో చక్కటి పరిష్కారం.. తెలుసా..?
Deeksha Divas | బీఆర్ఎస్ శ్రేణులంతా దీక్షా దివస్‌లో పాల్గొనాలి.. సీనియర్ నాయకుడు పార్సి రంగారావు పిలుపు
Special Trains | సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే
‘ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

