Teresa Seva Ratna Award | మూడు దశాబ్దాల ఆమె సేవకు దక్కిన గౌరవం.. గోలివాడ చంద్రకళ కు మదర్ థెరిస్సా సేవా రత్న అవార్డుతో సత్కారం
తెలంగాణ మిత్ర మండలి స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకురాలు గోలివాడ చంద్రకళ చేస్తున్న సమాజ సేవకు గౌరవం దక్కింది.. ప్రతిష్టాత్మక మధర్ థెరిస్సా ప్రతిభా సేవారత్న అవార్డు వరించింది.
Teresa Seva Ratna Award | కోల్ సిటీ, అక్టోబర్ 27: తెలంగాణ మిత్ర మండలి స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకురాలు గోలివాడ చంద్రకళ చేస్తున్న సమాజ సేవకు గౌరవం దక్కింది.. ప్రతిష్టాత్మక మధర్ థెరిస్సా ప్రతిభా సేవారత్న అవార్డు వరించింది. ఈ మేరకు అభినయ కల్చరల్ ఆర్ట్స్ 42వ వార్షికోత్సవం సందర్భంగా గోదావరిఖని ఆర్సీవోఏ క్లబ్ లో జరుగుతున్న కళోత్సవాలలో చంద్రకళను నిర్వాహకులు మథర్ థెరిస్సా సేవా రత్న అవార్డుతో ఘనంగా సత్కరించారు.
మూడు దశాబ్దాలుగా స్వచ్ఛంద సంస్థ ద్వారా చంద్రకళ పూట గడవని ఎంతోమంది నిరుపేదలు, నిస్సహాయులకు, అనారోగ్య బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ చేయూత అందించడమే గాకుండా నిరుపేద యువతుల వివాహాలను దగ్గరుండి జరిపించడం, పేద విద్యార్థులకు సాయం అందిస్తున్నారు. ప్రధానంగా పర్యావరణ పరిరక్షణలో తనవంతు పాత్రగా అనేక యేళ్లుగా పర్యావరణ హిత మట్టి వినాయక విగ్రహాలను స్వయంగా తయారు చేసి ప్రతీ ఏటా పంపిణీ చేస్తున్నారు. కరోనా విపత్తు సమయంలో ఆ వ్యాధి బారిన పడిన వారికి ఉచితంగా పోషకహారం, మందులను పంపిణీ చేశారు.
ఆమె సేవలను గుర్తించి అభినయ కల్చరల్ సంస్థ అధ్యక్షులు రేణికుంట్ల రాజమౌళి మథర్ థెరిస్సా సేవా రత్న అవార్డుతో ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఆవార్డు గ్రహీత చంద్రకళ మాట్లాడుతూ ప్రముఖ సంఘ సేవకురాలు మధర్ థెరిస్సాను స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవలో అలుపెరుగని ప్రయాణం చేస్తున్నానని, ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరిగినట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు.
తన సేవలను గుర్తించి అవార్డుతో సత్కరించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు కనకం రమణయ్య, రేణికుంట్ల సుశీల, సులోచన తోపాటు పలువురు సీనియర్ కళాకారులు పాల్గొన్నారు. చంద్రకళ పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
Russia-Ukraine | రష్యా-ఉక్రెయిన్ చర్చల్లో పురోగతి.. యుద్ధ ఖైదీల అప్పగింతపై పరస్పర అంగీకారం..!
రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్టుకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక
‘రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలి’
KTR | బీజేపీతో నిర్మల్‌లో ఒక్క పనైనా అయ్యిందా..? : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

