వర్షాలతో బల్దియా అల్టర్
కరీంనగర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బల్దియా అల్టర్ అయింది. నగరపాలక సంస్థ పరిధిలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు 24 గంటల పాటు డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది.
- 24 గంటలు అందుబాటులో డీఆర్ఎఫ్ బృందాలు
- నోడల్ అధికారులుగా డీఈలు
కార్పొరేషన్, జూలై 20: కరీంనగర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బల్దియా అల్టర్ అయింది. నగరపాలక సంస్థ పరిధిలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు 24 గంటల పాటు డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. ఆయా బృందాలకు నోడల్ అధికారులుగా డీఈలకు బాధ్యతలు అప్పగిస్తూ నగర కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొ బృందంలో డీఈతో పాటు ఏఈలు, టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది, పారిశుధ్య విభాగం అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బంది ఉంటారు. ముఖ్యంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విధులు నిర్వహించే బృందంలో 24 మంది సభ్యులు ఉన్నారు. దీనికి నోడల్ అధికారిగా డీఈ వెంకటేశ్వర్లు, సూపర్వైజర్గా టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీహరి వ్యవహరిస్తారు.
వీరితో పాటు ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లు, నలుగురు వర్క్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ఉంటారు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు విధుల్లో ఉండే బృందంలో 22 మంది సభ్యులు ఉన్నారు. దీనికి నోడల్ అధికారిగా డీఈ ఓం ప్రకాశ్, సూపర్వైజర్గా ఏఈ గపూర్ కొనసాగుతున్నారు. అలాగే రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు విధుల్లో ఉండే బృందంలో 18 మంది సభ్యులు ఉన్నారు. దీనికి నోడల్ అధికారిగా డీఈ అయూబ్‌ఖాన్, సూపర్వైజర్గా టీపీఎస్ నవీన్ వ్యవహరించనున్నారు. ఆయా బృందాలు నగరంలో ఎక్కడ వర్షంతో సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపడుతాయి.
నగరంలో ముసురు
కరీంనగరంలో శనివారం ఉదయం నుంచి ముసురు కొనసాగుతూనే ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం రాత్రి మోస్తారుగా కురిసింది. శనివారం ఉదయం నుంచి వర్షం పడుతుండడంతో నగరంలోని ప్రధాన రహదారులు కూడా నిర్మానుష్యంగా మారాయి. ఇక మురుగు కాల్వలన్నీ నిండుగా ప్రవహిస్తున్నాయి.
శిథిల భవనాల యజమానులు అప్రమత్తంగా ఉండాలి: మేయర్
వర్షాకాలం దృష్ట్యా నగరంలో శిథిల భవనాల యజమానులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ సునీల్‌రావు సూచించారు. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదాంగడ్డలోని అజ్జూ అనే వ్యక్తికి చెందిన గూన పెంకుల ఇంటి పైకప్పు కూలిపోగా, సమాచారం తెలుసుకున్న మేయర్ స్థానిక కార్పొరేటర్ షకీరా అంజూమ్ బరత్అలీతో కలిసి ఆ ఇంటిని పరిశీలించారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. సదరు కుటుంబ సభ్యులకు స్థానికంగా వేరే చోట ఆశ్రయం కల్పించారు. కాగా, ఆ ఇంటి యజమానులకు ఇప్పటికే నోటీసులు అందించామని పేర్కొన్నారు. వర్షకాలం దృష్ట్యా నగరంలో శిథిలావస్థలో ఉన్న 107 నివాస గృహాలను టౌన్ ప్లానింగ్ అధికారుల ద్వారా గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేశామని మేయర్ తెలిపారు. ఇప్పటికే దాదాపు 20కి పైగా పూర్తి స్థాయిలో శిథిలమైన నివాస గృహాలను టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారని చెప్పారు.
జలాశయాల్లోకి నీరు
శంకరపట్నం, జూలై 20: మూడు రోజులుగా కురుస్తున్న ముసురుతో కేశవపట్నం నుంచి అర్కండ్ల వరకు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలలోకి నీరు చేరుతున్నది. కాగా, సంవత్సరంలో దాదాపు ఎనిమిది నెలల పాటు జలకళ ఉట్టి పడే ముత్తారం రామసముద్రం చెరువు నిండి మత్తడి పారుతున్నది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

