ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి
ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బీర్పూర్ మండల పరిషత్ కార్యాలయంలో నాయకులు, మహిళలతో కలిసి అంగన్వాడీ భవనం ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీవోకు వినతి పత్రం అందజేశారు.
- అధికారులు బాధ్యత తీసుకోవాలి
- అంగన్వాడీ భవనాన్ని స్వాధీనం చేసుకోవాలి
- ఆక్రమణదారులకు పోలీసులు మద్దతు తెలుపడం సరికాదు
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి
- బీర్పూర్ ఎంపీడీవో కార్యాలయంలో వినతి
సారంగాపూర్, జూలై 9: ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బీర్పూర్ మండల పరిషత్ కార్యాలయంలో నాయకులు, మహిళలతో కలిసి అంగన్వాడీ భవనం ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడారు. బీర్పూర్ మండలం నర్సింహులపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 22లో 15 ఏండ్ల కింద అంగన్వాడీ భవనాన్ని లెంటల్ లెవల్ దాకా నిర్మించారని, దీనికి హౌస్ నంబర్ 3-96 ఇచ్చారని తెలిపారు.
అయితే, కొన్ని కారణాలతో నిర్మాణం నిలిచిపోయిందన్నారు. అయితే, సదరు సర్వే నంబర్‌ను ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 21ని ఆధారంగా చేసుకుని అంగన్వాడీ టీచర్ బోగ లత భర్త, బీపీఎంగా పనిచేసే సత్తయ్య భవనాన్ని ఆక్రమించారని ఆరోపించారు. భవనంలో అక్రమంగా బెల్ట్ షాపు, కిరాణషాపు అమ్మకాలు చేస్తున్నారని బీర్పూర్ తహసీల్దార్ గతేడాది డీపీవోకు ఫిర్యాదు చేయగా, ఆయన విచారించి అంగన్వాడీ భవనాన్ని తొలగించాలని ఆర్డర్ ఇచ్చారని వివరించారు. ఏడాది గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గత ఆదివారం గ్రామస్తులే స్వయంగా వెళ్లి అక్రమ నిర్మాణాన్ని తొలగించారని వివరించారు. గ్రామస్తులు కూలగొట్టిన సమయంలో ఎస్ఐ ఆక్రమణదారుడికి అండగా నిలిచి నలుగురు గ్రామస్తులపై దాడిచేయడం సరికాదన్నారు.
ఆక్రమణదారులకు అండగా నిలిస్తే ఎస్ఐపైనా క్రిమినల్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడడం ప్రభుత్వ అధికారుల బాధ్యత అని, పోలీస్ శాఖ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు మద్దతు తెలుపాలి కానీ, ఆక్రమణదారులకు అనుగుణంగా పనిచేయడం సరికాదన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌కు, దీనికి ఏం సంబంధం ఉంటుందని, మిస్‌గైడ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు కొల్ముల రమణ, ముక్క శంకర్, చెరుపూరి సుభాస్, రిక్కల ప్రభాకర్, గుడిసే జితేందర్ యాదవ్, ఆడెపు తిరుపతి, రంగు మల్లేశం, ఆయా గ్రామాల నాయకులు, నర్సింహులపల్లి గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

