Governor Jishnu Dev Varma | మంథని జేఎన్టీయూ ప్రొపెసర్ నరహరి అజ్మీరాకు డాక్టరేట్.. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా పట్టా స్వీకరణ
పరిశోధన రంగంలో విశేష కృషి చేసిన డాక్టర్ నరహరి అజ్మీరా డాక్టరేట్ పట్టా సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన 24వ స్నాతకోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఆయన డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) పట్టా అందుకున్నారు.
Governor Jishnu Dev Varma | రామగిరి, నవంబర్ 28 : పరిశోధన రంగంలో విశేష కృషి చేసిన డాక్టర్ నరహరి అజ్మీరా డాక్టరేట్ పట్టా సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన 24వ స్నాతకోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఆయన డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు, సహచరులు, మిత్రులు, కుటుంబ సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. డాక్టర్ నరహరి అజ్మీరా ప్రస్తుతం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ (జేఎన్టీయూ) పరిధిలోని మంథని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో డాక్టర్ పీ కామాక్షి పర్యవేక్షణలో ‘సెంటిమెంట్ అనాలిసిస్ బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ రివ్యూస్ యూజింగ్ డీప్ లెర్నింగ్ అప్రోచెస్’ అనే అంశంపై విస్తృత పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు.
ఈ పరిశోధనలో భాగంగా డీప్ లెర్నింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వివిధ ఉత్పత్తులపై వినియోగదారులు వ్యక్తం చేసే అభిప్రాయాలు, సమీక్షలను విశ్లేషించే ఆధునిక విధానాలను ప్రతిపాదించారు. వినియోగదారుల అభిప్రాయాలను కచ్చితంగా అర్థం చేసుకోవడంలో కృత్రిమ మేథస్సు, డీప్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతల ప్రాధాన్యతను ఈ పరిశోధన చాటిచెప్పింది. తన పరిశోధనకు మార్గనిర్దేశం చేసిన పర్యవేక్షకురాలు డాక్టర్ పీ కామాక్షి, పరిశోధనలో సహకరించిన అధ్యాపకులు, తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, ప్రోత్సహించిన శ్రేయోభిలాషులకు డాక్టర్ నరహరి అజ్మీరా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగంలో అధ్యాపకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ పరిశోధనలోనూ ప్రతిభ కనబరిచి డాక్టరేట్ సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆయన భవిష్యత్‌లో మరిన్ని నూతన పరిశోధనలు చేపట్టి విద్యా, సాంకేతిక రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
car plunges into gorge | లోయలో పడిన కారు.. ఆరుగురు మహిళలతో సహా ఏడుగురు మృతి, మరో ఐదుగురికి గాయాలు
‘విద్యార్థులకు నిర్దేశిత మెనూ తప్పనిసరిగా అమలు చేయాలి’
‘సాగునీటి తరలింపును అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం’
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

