జగిత్యాల : జిల్లాలో నేరాల నియంత్రణ ( Crime Controll )తో పాటు నేరాలను త్వరితగతిన ఛేదించాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ( SP Ashok Kumar ) ఆదేశించారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన నెలవారీ క్రైమ్ మీటింగ్లో పోలీస్ అధికారులతో సమావేశమై వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్-అలైవ్ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. బక్రీద్, హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి నేరాల నివారణకు ప్రాధాన్యత ఇస్తూనే జరిగిన నేరాలను త్వరితగతిన ఛేదించి బాధితులకు న్యాయం అందించే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు.