Chigurumamidi | ఇందుర్తిలో కార్డన్ అండ్ సెర్చ్.. గ్రామస్తులకు ఏసీపీ అవగాహన
చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ సీఐ అనిల్, కొత్తపల్లి సీఐ బిళ్ళ కోటేశ్వర్, చిగురుమామిడి ఎస్ఐ జగదీశ్వర్, సిబ్బందితో కలిసి ఇందుర్తి గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
Chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 6 : చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ సీఐ అనిల్, కొత్తపల్లి సీఐ బిళ్ళ కోటేశ్వర్, చిగురుమామిడి ఎస్ఐ జగదీశ్వర్, సిబ్బందితో కలిసి ఇందుర్తి గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ చింతపూల నరేందర్ అధ్యక్షతన గ్రామస్తులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ హాజరై మాట్లాడారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, కార్డన్ అండ్ సెర్చ్ అంటే కేవలం తనిఖీలు చేయడం మాత్రమే కాకుండా ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నేడు సమాజంలో సైబర్ నేరాలు చాలా పెరిగిపోయాయనీ, వాట్సాప్లో తెలియని లింకులు, తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్ లను నమ్మి డబ్బులు పంపించవద్దన్నారు. ఎవరైనా డబ్బులు డబుల్ ఇస్తామని చెబితే అది మోసమే అని గుర్తించాలని గ్రామస్తులకు సూచించారు.యువత అక్రమ బెట్టింగ్ యాప్ లకు, మాదకద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవడం బాధాకరమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని కోరారు. గ్రామంలో ఎవరైనా గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సూచించారు.
మహిళల భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేదనీ,మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధించినా కఠిన చర్యలు కుంటామని హెచ్చరించారు. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనీ, హెల్మెట్ లేకుండా, మద్యం తాగి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపవద్దన్నారు. వాహనానికి సంబంధించిన లైసెన్స్, ఆర్.సి, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ లు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది గ్రామస్తులు హాజరయ్యారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Former Minister Talasani | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను వెంటనే విడుదల చేయాలి : మాజీ మంత్రి తలసాని
Palakurthi Congress Leaders | భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారు?
Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా సంస్థ చమురు నిల్వల వద్ద అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
Peptides | అమెరికా ఆరోగ్య రంగంలో కీలకమార్పు.. పెప్టైడ్ల వినియోగానికి గ్రీన్ సిగ్నల్.. ఏంటివి.. ఎలా పనిచేస్తాయి..?
Illegal Arrest | బీఆర్ఎస్ నాయకుడు బాలరాజు యాదవ్ అక్రమ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

