Mannempalli | మన్నెంపల్లిలో వీవో బిల్డింగ్ నిర్మాణానికి సహకరించాలి.. భరతమాత వీవో అధ్యక్షురాలు మార్కొండ లత
తమకు రాజకీయాలతో సంబంధం లేదని.. గ్రామ పాలకవర్గం, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ తీసుకుని మహిళా సమాఖ్య భవనం నిర్మాణం అయ్యేలా చూడాలని భరతమాత గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు మార్కొండ లత కోరారు.
Mannempalli | తిమ్మాపూర్, సెప్టెంబర్ 22 : తమకు రాజకీయాలతో సంబంధం లేదని.. గ్రామ పాలకవర్గం, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ తీసుకుని మహిళా సమాఖ్య భవనం నిర్మాణం అయ్యేలా చూడాలని భరతమాత గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు మార్కొండ లత కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపెల్లి గ్రామంలో కొత్త వివో భవన నిర్మాణానికి పంచాయతీ పాలకవర్గంతో పాటు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సహకరించాలని కోరారు. ఎల్ఎండీలో లత మంగళవారం మీడియాతో మాట్లాడారు. గతంలో సర్పంచ్ గా పనిచేసిన గడ్డం సుగుణ వీవో భవనానికి స్థలం కేటాయించారని, ఆ స్థలంలో కొత్త గ్రామపంచాయతీ భవనం కట్టగా, పాత గ్రామ పంచాయతీ భవనాన్ని మహిళా సంఘానికి వాడుకున్నామని తెలిపారు.
ఇటీవల కలెక్టర్ నిధులు కేటాయించడంతో పాత గ్రామ పంచాయతీని కూల్చివేసి అందులో కొత్త కొత్త భవనం నిర్మించేలా చూడాలని ఎమ్మెల్యేను కోరమన్నారు. అయితే భవనం కూల్చకుండా ప్రస్తుత సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్ అడ్డుకోవడంతో గ్రామంలో గొడవ జరిగిందనీ, ఆ గొడవకు మహిళా సంఘాలకు ఎలాంటి సంబంధం లేదనీ స్పష్టం చేశారు. ప్రస్తుతం పాత పంచాయతీ భవనం కూల్చి వేశారని, ఆ స్థలంలో కొత్త భవనం నిర్మించేలా పంచాయతీ పాలకవర్గం తీర్మానం ఇవ్వాలని కోరారు. మహిళా సంఘాలకు, రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదనీ, కావున వెంటనే భవన నిర్మాణం పూర్తిచేసి, మహిళలకు అందుబాటులోకి తేవాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

