Chigurumamidi | చిగురుమామిడి, అక్టోబర్ 3 : హుస్నాబాద్ నుండి కొత్తపల్లి వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణంలో భాగంగా చిగురుమామిడిలో ఇల్లు కోల్పోతున్న బాధితులు చేపట్టిన నిరాహార దీక్షకు బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ శనివారం సంఘీభావం ప్రకటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఇల్లు కోల్పోతున్న వారికి సముచిత న్యాయం చేయాలన్నారు. లేకుంటే బైపాస్ రోడ్డు ద్వారా రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. వీరి వెంట బీఎస్పీ మండల అధ్యక్షుడు శ్రవణ్, నాయకులు వేల్పుల రాజు, మారేపల్లి సుధాకర్ తదితరులు ఉన్నారు.