బోయినపల్లి, జూలై 20 : ఎస్సారార్ రిజర్వాయర్ గేట్లు జిగేల్మంటున్నాయి. రంగురంగుల లైట్ల మధ్యలో నుంచి జాలువారుతున్న ధారలు ఎంతో ముచ్చట గొలుపుతున్నాయి.
ప్రస్తుతం మూలవాగు, ఎస్సారెస్పీ వరద కాలువ, ఇతర వాగుల ద్వారా 11,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నదని, ఔట్‌ఫ్లో రూపంలో 5895 క్యూసెక్కులు వదులుతున్నామని ఇంజినీరింగ్ అధికారవర్గాలు తెలిపాయి. రిజర్వాయర్‌లో 27.50 టీఎంసీలకుగాను ప్రస్తుతం 18.78 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నాయి.