కమాన్ చౌరస్తా, అక్టోబర్ 6 : 70వ SGFI గేమ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ ఎనిమిదో తరగతి విద్యార్థిని ఈ సహస్ర ప్రతిభ చాటింది. కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ వేదికగా నిర్వహించిన అండర్-17 బాలికల షాట్పుట్ విభాగంలో జిల్లా స్థాయిలో తృతీయ స్థానం సాధించి ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది. సహస్ర సాధించిన విజయంపై పాఠశాల డైరెక్టర్ అనుదీప్ సౌగాని అభినందించారు.
క్రీడల పట్ల ఆమెకున్న అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదలను ప్రశంసించారు. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం, విద్యార్థులు సహస్రకు అభినందనలు తెలిపారు. రానున్న పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరచి పాఠశాలకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.