కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 4 : తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనార్టీలకు పలు రకాల వృత్తుల్లో శిక్షణ ఇచ్చేందుకు తగిన సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి జగదీశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థతో అనుసంధానమైన ఉన్న వృత్తి శిక్షణ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
వృత్తి శిక్షణ సంస్థ రిజిస్ట్రేషన్ ప్రతి, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థతో అనుసంధానమైన కాపీ, గడచిన మూడేళ్ల ఆదాయ పన్ను రిటర్న్స్, ఆడిట్ రిపోర్ట్స్ కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల నుంచి గడిచిన మూడేండ్ల కాలానికి సంబంధించి కోర్సు పూర్తి చేసిన సర్టిఫికెట్లు, వర్క్ ఆర్డర్ కాపీలు, గడిచిన ఏడాది కాలానికి సంబంధించి ఉద్యోగ కల్పన కింద ఉద్యోగం పొందిన వారి నుంచి సంబంధిత ధ్రువపత్రాలు, బ్యాంక్ స్టేట్మెంట్లతో తమ దరఖాస్తులను ఈ నెల 15లోగా కరీంనగర్ కలెక్టరేట్లోని ఒకటో అంతస్తులో ఉన్న జిల్లా మైనార్టీస్ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.