Siddi Sridhar | రైతులు పంట మార్పిడి విధానం చేపట్టాలి: వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీధర్
రైతులు పంట మార్పిడి విధానం చేపట్టి అధిక దిగుబడి సాధించాలని కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సిద్ది శ్రీధర్ (Siddi Sridhar) తెలిపారు.
కాల్వ శ్రీరాంపూర్, మే 24: రైతులు పంట మార్పిడి విధానం చేపట్టి అధిక దిగుబడి సాధించాలని కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సిద్ది శ్రీధర్ (Siddi Sridhar) తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామంలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో భాగంగా రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు భూసారాన్ని పరీక్షించుకోవాలని సూచించారు. పంటలపై యూరియాను అధికంగా వినియోగించితే పెను ప్రమాదం వాటిల్లుతుందని చెప్పారు. ప్రతి రైతు సాధ్యమైనంతవరకు యూరియాను పంటలపై తక్కువగా వినియోగించాలని తెలిపారు.
పప్పు, చిరుధాన్యాలు, నూనె గింజలు వేసినట్లయితే నీటి వినియోగం తక్కువగా ఉంటుందని, తద్వారా రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు. తొలకరి వర్షాలకు జీలుగా, జనుము, పెసరు, తదితర వాటిని నాటి 45 రోజుల తర్వాత భూమిని దున్నాలన్నారు. వరి లాంటి పంటలు వేసినట్లయితే భూసారం పెరిగి అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త మధుకర్ రావు, ఏడీఏ శ్రీనాథ్ మండల వ్యవసాయ అధికారి నాగార్జున, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మాజీ సర్పంచులు గాజనవేన సదయ్య, పొన్నమనేని దేవేందర్ రావు, మాదాసి సతీష్, గోపాల కిషన్ రావు, మూడెత్తుల లింగయ్య, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

