Farmer | కాంగ్రెస్ సర్కార్ పాలనలో రైతన్నల కష్టాలు ఎలా ఉన్నాయో కండ్లకు కట్టినట్టు చూపించే ఎన్నో దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయని తెలిసిందే. ఓ వైపు ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం.. మరోవైపు కరెంట్ కోతలతో పంటను ఎలా కాపాడుకోవాలో తెలియక అన్నదాతలు సతమతమవుతున్నారు.
వరి పంటను ఎలాగైనా కాపాడుకోవాలని కొందరు రైతులు ట్యాంకర్లతో నీరు పారించి నేలను తడిపిస్తుంటే.. మరికొందరు రైతులేమో చేసేదేమి లేక రోజూ వేల రూపాయలు ఖర్చు పెడుతూ జనరేటర్ల సాయంతో నీటిని పారపెడుతున్నారు. ఇక మరికొంతమంది రైతులేమో ఎండిపోయిన వరిపంటలో పశువులను మేపుతున్నారు. ఓ యువరైతు తమ పరిస్థితి ఎలా ఉందో తెలిపేందుకు
ఎండిపోయిన వరి పొలంలో బైక్ నడిపి నిరసన తెలిపాడు. మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గం ఖానాపూర్ గ్రామంలో కరెంట్ కోతలతో, సాగునీరు లేక పంటలు ఎండిపోయాయని.. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని భావించిన రైతు శ్రావణ్ కుమార్ బైక్పై వరిలో తిరుగుతూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఎండిపోయిన వరి పొలంలో బైక్ నడిపి నిరసన తెలిపిన రైతు
మంత్రి శ్రీధర్ బాబు ఇలాకా మంథని నియోజకవర్గం ఖానాపూర్ గ్రామంలో కరెంట్ కోతలతో, సాగునీరు లేక పంటలు ఎండిపోయాయని రైతు శ్రావణ్ కుమార్ వినూత్న రీతిలో నిరసన https://t.co/RcGykRY813
— Telugu Scribe (@TeluguScribe) October 8, 2026
Uttarpradesh: టీ కోసం దాబా వద్ద ఆగారు.. 8 ఏళ్ల కొడుకును వదిలేసి 80 కిలోమీటర్ల దూరం వెళ్లారు
Paddy Crop | జనరేటర్ పెడితే రోజుకు రూ.3-4 వేలు ఖర్చు.. పశువులకు మేతగా వరి పంట.. వీడియో