65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత..!
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న 65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ తెలిపారు.
సుల్తానాబాద్ రూరల్, మార్చి 13: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న 65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ తెలిపారు. గురువారం తమకు పక్కాగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పెద్దపల్లి మండలం బండారి కుంట, సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామాల్లో ఎన్ఫోర్స్ మెంట్ సిబ్బందితో కలిసి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలో నిల్వ ఉన్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం, పెద్దపల్లిలోని బండారి కుంట వద్ద అక్రమంగా నిల్వ ఉన్న 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తనిఖీల్లో పట్టుకున్నామన్నారు. 65 క్వింటాళ్ల రేషన్ బియ్యంతోపాటు ఆ బియ్యం తరలించడానికి ఉపయోగిస్తున్న ఆటో సీజ్ చేశామన్నారు. సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించి, ఆటోను పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు.
వాహనం యజమాని, డ్రైవర్, అక్కడ పని చేస్తున్న ఇతర కార్మికులపై తెలంగాణ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ నియంత్రణ ఉత్తర్వులు- 2016 ప్రకారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని రాజేందర్ తెలిపారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ తహశీల్దార్లు రవీందర్, మహేష్ కుమార్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

